×
Ad

ICC Warns Pakistan : పీసీబీ చీఫ్ నఖ్వి ఓవరాక్షన్.. గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ.. తలలు పట్టుకుంటున్న పాక్ క్రికెటర్లు..

ICC Warns Pakistan : పీసీబీ చీఫ్‌ మోసిన్‌ నఖ్వి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టుపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుం

PCB chairman Mohsin Naqvi

  • బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందన్న పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ
  • నఖ్వీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ
  • పాక్ క్రికెట్ పై ఆంక్షల విధించేందుకు సిద్ధమవుతున్న ఐసీసీ

ICC Warns Pakistan : టీ20 వరల్డ్ కప్-2026 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టును తప్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం కల్పించింది. బంగ్లాదేశ్ జట్టును తప్పించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ కు ఐసీసీ అన్యాయం చేసిందని వ్యాఖ్యానించాడు.

Also Read : T20 World Cup : బంగ్లాదేశ్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు.. ఆ దేశం ఎన్నికోట్లు నష్టపోతుందో తెలుసా?

బంగ్లాదేశ్ ఐసీసీలో కీలక పాత్రధారి. వారితో అన్యాయంగా వ్యవహరించారు. బుధవారం ఐసీసీ సమావేశంలో కూడా నేను ఇదే చెప్పా. భారత్‌కు బంగ్లా జట్టును పంపకూడదన్న నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకు ముందు భారత్, పాకిస్థాన్‌ల కోసం ఐసీసీ వేదికలను మార్చినప్పుడు బంగ్లాదేశ్ కోసం అలా ఎందుకు చేయరు అంటూ నఖ్వి అన్నాడు. నఖ్వి వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఒకవేళ పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్ బాటలో నడిచి టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి వైదొలిగితే ఆ దేశ క్రికెట్ పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అదేజరిగితే అన్ని ద్వైపాక్షిక సిరీస్ లను సస్పెండ్ చేయడం, పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడే విదేశీ ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తిరస్కిరంచడం, ఆసియా కప్ నుంచి పాక్ ను బయటకు పంపించడం వంటి చర్యలున్నట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్‌పై ఐసీసీ ఎలాంటి ఆంక్షలు విధించగలదు?
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తరహాలో పాకిస్థాన్ జట్టు కూడా తప్పుకునేందుకు సిద్ధమైతే ఆ జట్టుపై కఠిన ఆంక్షలు విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో విదేశీ ఆటగాళ్లకు అనుమతికపోవచ్చు. ఐసీసీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అందించే నిధుల్లో భారీ కోత విధించే చాన్స్ ఉంటుంది. తద్వారా పీసీబీ భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. అంతేకాదు.. పాకిస్థాన్ సూపర్ లీగ్ కు అంతర్జాతీయ గుర్తింపుతోపాటు వాణిజ్య మద్దతును ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ను పక్కకు పెట్టేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్ జట్టుతో జరిగే అన్ని ద్వైపాక్షిక సిరీస్ లను రద్దు చేసే చాన్స్ ఉంటుంది. ఇలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తే పాకిస్థాన్ క్రికెట్ అస్తిత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

తాజాగా నఖ్వీ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్ గా తీసుకోవటంతో పాకిస్థాన్ క్రికెటర్లు తలలు పట్టుకుంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ బంగ్లాదేశ్ ను అనుసరించే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నఖ్వీ సైతం దాదాపు అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొనే విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదని, కేవలం పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటుందని చెప్పాడు. పాకిస్థాన్ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన స్వదేశానికిరాగానే ఈ విషయంపై చర్చిస్తామని, ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటామంటూ నఖ్వీ పేర్కొన్నారు.