India Vs Pakistan : తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‍తో భారత్ ఢీ.. వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్

ఐసీసీ 2022 వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. మార్చి 6న తన తొలి మ్యాచులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మార్చి 10న.

India Vs Pakistan : ఐసీసీ 2022 వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. మార్చి 6న తన తొలి మ్యాచులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మార్చి 10న న్యూజిలాండ్, 12న వెస్టిండీస్, 16న ఇంగ్లండ్, 19న ఆస్ట్రేలియా, 22న బంగ్లాదేశ్, 27న సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.

న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. టోర్నీలో మొదటి మ్యాచ్ 2022 మార్చి 4న న్యూజిలాండ్, వెస్టిండీస్ ల మధ్య జరుగుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచులోనే పాకిస్తాన్ జట్టుతో మార్చి 6న తలపడనుంది.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

లీగ్‌ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో మ్యాచులు ఆడుతుంది. ఆక్లాండ్‌, క్రైస్ట్‌చర్చి, డ్యునెడిన్‌, హామిల్టన్‌, తౌరంగా, వెల్లింగ్టన్‌ వేదికలుగా మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీ ఫైనల్‌ మార్చి 30న వెల్లింగ్టన్‌ వేదికగా.. రెండో సెమీఫైనల్‌ మార్చి 31న క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ ఏప్రిల్‌ 3న క్రైస్ట్‌చర్చి వేదికగానే జరగనుంది. కాగా ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేను కేటాయించారు.

Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. పంపడానికి ముందే చెక్ చేసుకునేలా

ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్‌ 2017-20 వరకు పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, భారత్‌లు ప్రపంచకప్‌కు క్వాలిఫై అయినట్లు తెలిపింది. ఇక ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్‌ కూడా నేరుగా క్వాలిఫై జాబితాలో చేరింది. మిగిలిన మూడు జట్లు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌లు అర్హత కోసం క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. కోవిడ్‌ నేపథ్యంలో మ్యాచ్‌లను రద్దు చేశారు.

ట్రెండింగ్ వార్తలు