Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. పంపడానికి ముందే చెక్ చేసుకునేలా

వాట్సప్ లో ఇప్పటి వరకూ చూడని ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. చాలా సింపుల్ అయిన ఈ ఫీచర్ మనం పంపబోయే వాయీస్ మెసేజ్ ను ముందుగానే చెక్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా...

Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. పంపడానికి ముందే చెక్ చేసుకునేలా

Whatsapp

Whatsapp: వాట్సప్ లో ఇప్పటి వరకూ చూడని ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. చాలా సింపుల్ అయిన ఈ ఫీచర్ మనం పంపబోయే వాయీస్ మెసేజ్ ను ముందుగానే చెక్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా వాయీస్ పంపుకుని అది బాగాలేకపోతే డిలీట్ చేసుకోవడం వల్ల అవతలి వ్యక్తికి మనం మళ్లీ మళ్లీ మెసేజ్ పంపుతున్నామని తెలిసేది. ఇప్పుడలా కాదు.

మీ సొంత వాయీస్ రికార్డింగ్ ను ముందుగానే విని ఎటువంటి ఇబ్బంది లేదంటేనే పంపుకోవచ్చు. ఒకవేళ అందులో ఏదైనా తప్పులు ఉంటే డిలీట్ చేసుకోవచ్చు. అది కూడా అవతలి వ్యక్తికి తెలియకుండానే..

ప్రత్యేకించి ఇండియాలో వాయీస్ మెసేజింగ్ అనేది చాలా పాపులర్ గా ఉంది. చాలా భాషల్లో వెళుతున్న మెసేజ్ లకు మరో ఫీచర్ ను యాడ్ చేయనుంది వాట్సప్. వాయీస్ మెసేజింగ్ ఫీచర్ లో పాస్ చేసుకుని పంపుకోవడం లాంటిది టెస్టింగ్ లో ఉంది. అది కూడా అందుబాటులోకి వస్తే.. ఇక ఈ ఫీచర్ కు తిరుగుండదు.