×
Ad

ICC Womens World Cup: అద్భుత విజయం.. ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత్.. జెమీమా సూపర్ సెంచరీ..

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Courtesy @ ESPNCricInfo

ICC Womens World Cup: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్స్ కి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ లో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ చేధించింది. భారత ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీతో కదం తొక్కింది. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకి విజయాన్ని అందించింది. జెమీమా 134 బంతుల్లో 127 పరుగులు చేసింది. 14 ఫోర్లు బాదింది. మరో ఎండ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 88 బంతుల్లో 89 పరుగులు చేసింది.

చివరలో రిచా ఘోష్, దీప్తి ధనాధన్ బ్యాటింగ్ చేశారు. దీంతో భారత్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.

Also Read: ముంబైని వీడి కేకేఆర్‌కు వెళ్ల‌నున్న రోహిత్ శ‌ర్మ‌?.. అది మాత్రం క‌న్ఫార్మ్ అంటూ ముంబై పోస్ట్..