ICC వరల్డ్ కప్ జట్టు ప్రకటించే తేదీ ఎప్పుడంటే..

క్రికెట్ అభిమానులకు కొద్ది రోజులుగా కనులవిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనంతరం టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో ఆడనుంది. ఈ క్రమంలో లీగ్ జరుగుతుండగానే ప్రపంచ కప్‌లో తలపడే భారత జట్టు గురించి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించాడు. మే 30 నుంచి ఆరంభం కానున్న ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌గా దక్షిణాఫ్రికాపై జూన్ 5న ఆడనుంది. 
Read Also : IPL 2019: రహానె దొరికిపోయాడు.. రూ.12లక్షలు జరిమానా

ఈ టోర్నీకి ఐపీఎల్ ప్రదర్శనకు ఏమాత్రం సంబంధం లేదని ముందుగానే తేల్చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అదే విషయాన్ని బలపరుస్తూ ఐపీఎల్ జరుగుతుండగానే బీసీసీఐ ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 20న ప్రపంచ కప్ టోర్నీలో తలపడనున్న 15 మంది ప్లేయర్ల వివరాలను ప్రకటించనున్నట్లు పేర్కొంది. 

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెస్కే.. ‘ఏప్రిల్ 20 కంటే ముందుగానే ప్రపంచ కప్ జట్టును ప్రకటించాలనుకుంటున్నాం. మంచి జట్టునే తయారుచేశామని అనుకుంటున్నా. ఈ జట్టును సిద్ధం చేయడానికి ఏడాదిన్నరగా కష్టపడుతున్నాం. ఎంతో మంది ప్లేయర్లను.. వారి కాంబినేషన్‌లను పరిశీలించాం. ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచ కప్‌లో కచ్చితంగా భారత జట్టు రాణిస్తోందనే విశ్వాసంతో ఉన్నాం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. 

ప్రస్తుతమున్న ఫామ్‌ను బట్టి చూస్తే.. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ టాప్ 3 బ్యాట్స్‌మెన్‌గా స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన ప్లేయర్లుగా ఎంఎస్ ధోనీ,  కేదర్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులో స్థానం ఖాయం చేసుకున్నట్లే. కానీ, ఇంకా నెం.4లో బ్యాటింగ్‌కు దిగే ప్లేయర్ ఎవరనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. దాంతో పాటు మూడో స్పిన్నర్ కోసమూ భారత జట్టు వెదుకుతోంది. 
Read Also : KXIP vs DC: ఢిల్లీపై పంజాబ్ పోరాటం ఫలించేనా..