IPL 2025: ఆర్‌సీబీ కెప్టెన్‌ ర‌జ‌త్‌కు హర్భజన్‌ సింగ్‌ వార్నింగ్.. ఎందుకంటే? 

అటువంటి దిగ్గజ ఆటగాళ్లతో ఉన్న టీమ్‌ను నడిపించడం అంటే సాధారణ విషయం కాదని చెప్పారు.

©BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో యువ ఆట‌గాడు ర‌జ‌త్ పటీదార్‌ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)కు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆర్సీబీ కెప్టెన్‌గా డుప్లెసిస్‌ ఉండేవాడు. అతడు ఇప్పుడు ఢిల్లీ జట్టులో ఆడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ 17 సీజన్లలో ఒక్కసారయినా ఐపీఎల్‌లో కప్‌ కొట్టలేదు.

ఇప్పుడు అటువంటి జట్టుకు రజత్‌ పటీదార్‌ సారథ్యం వహిస్తున్నాడు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించారు. అటువంటి పెద్ద టీమ్‌కు కెప్టెన్‌గా ఉండడం రజత్ పటీదార్‌కు పెద్ద చాలెంజ్‌ అని చెప్పారు. టీమిండియాకు సారథ్య బాధ్యతలు వహించడం కంటే ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉండటమే చాలా క్లిష్టతరమని తెలిపారు.

Also Read: ఆ భారీ గంటను మోగించిన జైషా, గంగూలీ.. ఎందుకంటే?

అతడు ఒత్తిడిని బాగా ఎదుర్కొనే అవకాశం ఉందని హర్భజన్‌ సింగ్‌ చెప్పారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్యాన్స్ కి రజత్ పటీదార్ మీద భారీగా అంచనాలు ఉన్నాయని తెలిపారు. ఆ జట్టులో విరాట్‌ కోహ్లీ కూడా ఉండాడని, అటువంటి దిగ్గజ ఆటగాళ్లతో ఉన్న టీమ్‌ను నడిపించడం అంటే సాధారణ విషయం కాదని చెప్పారు.

కెప్టెన్సీతో పాటు తన బ్యాటింగ్‌ మీద కూడా రజత్ పటీదార్ దృష్టి సారించాల్సి ఉంటుందని హర్భజన్ సింగ్ తెలిపారు. రజత్ పటీదార్‌ను 5 సీజన్ల కోసం కెప్టెన్‌గా తీసుకున్నట్లు ఆ టీమ్‌ యాజమాన్యం చెబుతోందని, అయితే, టీమ్‌ను అతడు గెలిపించలేకపోతే పరిస్థితులు మారే అవకాశం ఉందని చెప్పారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌తో ఆర్సీబీ తొలి మ్యాచ్ ఆడింది.