IPL 2025 Video: ఆ భారీ గంటను మోగించిన జైషా, గంగూలీ.. ఎందుకంటే?

సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈడెన్ గార్డెన్స్ వద్ద ఇలాంటి గంటను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

IPL 2025 Video: ఆ భారీ గంటను మోగించిన జైషా, గంగూలీ.. ఎందుకంటే?

PIC: @IPL

Updated On : March 22, 2025 / 8:36 PM IST

ఐపీఎల్‌ 2025 మ్యాచులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జైషా, భారత మాజీ క్రికెటర్లు ఝులాన్ గోస్వామి, సౌరవ్ గంగూలీ ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వద్ద గంట మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈడెన్‌ గార్డెన్స్‌ కోల్‌కతాలో ఉన్న విషయం తెలిసిందే. ఆటకు ముందు ఇలా గంట మోగించే సంప్రదాయం దేశంలోని రెండే రెండు స్టేడియాల్లో ఉంది. ఒకటి ఈడెన్‌ గార్డెన్స్‌, మరొకటి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం.

ఈడెన్‌ గార్డెన్స్‌ వద్ద ఇలా బెట్‌ కొట్టే సంప్రదాయాన్ని 2016 సెప్టెంబరులో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈడెన్‌ గార్డెన్స్‌ ప్రపంచంలోనే ప్రసిద్ధ చెందిన క్రికెట్ స్టేడియాల్లో ఒకటి. దాదాపు 68000 మంది ఇందులో కూర్చోవచ్చు.

Also Read: ఒకే వేదికపై ఇద్దరు కింగ్‌లు.. షారుక్, కోహ్లీ డ్యాన్స్‌ చూశారా.. కెవ్వుకేక?

లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో కూడా టెస్ట్ మ్యాచ్‌లలో ఆట ప్రారంభానికి ముందు గంట మోగించే సంప్రదాయం ఉంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఈడెన్ గార్డెన్స్‌ను భారత ఉపఖండంలోని ‘లార్డ్స్‌’ గా అభివర్ణించారు.

సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈడెన్ గార్డెన్స్ వద్ద ఇలాంటి గంటను ఏర్పాటు చేయనున్నట్లు 2016 జూలైలో ప్రకటించారు. చెప్పినట్లుగానే ఏర్పాటు చేశారు.

న్యూజిలాండ్- భారత్ టెస్ట్ మ్యాచ్ (2016 సెప్టెంబరులో) ప్రారంభానికి ముందు.. 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్‌తో మొదటిసారి ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ గంటను కొట్టించారు. ఐపీఎల్‌ 2024 ఏప్రిల్‌ 16న కేకేఆర్, ఆర్ఆర్‌ మధ్య మ్యాచ్‌కు ముందు కూడా ఈడెన్ గార్డెన్స్ బెల్‌ను మోగించారు. ఇవాళ కూడా ఈ బెల్‌ను మోగించడం గమనార్హం.