IPL 2025: ఒకే వేదికపై ఇద్దరు కింగ్‌లు.. షారుక్, కోహ్లీ డ్యాన్స్‌ చూశారా.. కెవ్వుకేక?

కేకేఆర్‌ బ్యాటర్ రింకు సింగ్‌ను కూడా షారుక్‌ వేదికపైకి పిలిచారు.

IPL 2025: ఒకే వేదికపై ఇద్దరు కింగ్‌లు.. షారుక్, కోహ్లీ డ్యాన్స్‌ చూశారా.. కెవ్వుకేక?

Pic: @IPL

Updated On : March 22, 2025 / 7:51 PM IST

ఐపీఎల్ 2025 ప్రారంభమైంది. తొలి మ్యాచు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. అంతకుముందు ఆరంభ వేడుకలు నిర్వహించారు.

స్టేజీపై ఇద్దరు కింగ్‌లు కనపడ్డారు. బాలీవుడ్ బాద్‌ షా, కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్టేజీపై డ్యాన్స్ చేసి అలరించారు.

పీఎల్ 2025 ప్రారంభ వేడుకలో షారుక్‌ ఖాన్ హోస్ట్ గా చేశారు. ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్, బాలీవుడ్ నటి దిశా పటానీ సహా పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. మ్యూజిక్, డ్యాన్స్‌ తో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది.

కోహ్లీని షారుక్ వేదికపైకి ఆహ్వానించారు. ‘కోహ్లీ, కోహ్లీ’ అంటూ షారుక్ నినాదాలు చేశారు. దీంతో కోహ్లీ కాస్త సిగ్గుడినట్లు అనిపించింది. కోహ్లీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత.. కేకేఆర్‌ బ్యాటర్ రింకు సింగ్‌ను కూడా షారుక్‌ వేదికపైకి పిలిచారు.

అయితే, స్టేజీపై రింకు సింగ్‌ డ్యాన్స్‌ చేయలేదు. షారుక్, కోహ్లీ పఠాన్‌ హూక్ స్టెప్స్‌తో అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.