Team India: ఈ లాజిక్ వర్కౌట్ అయితే.. వన్డే ప్రపంచకప్ మనదే!?
టీమిండియా ఫ్యాన్స్ చెబుతున్న లాజిక్ వర్కౌట్ అయితే టీమిండియా విజేతగా నిలుస్తుందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.

Team India Players (Photo: @BCCI)
Team India – ODI World Cup: అంతర్జాతీయ వన్డే ప్రపంచకప్ సమరానికి సమయం దగ్గర పడుతోంది. నాలుగేళ్లకొకసారి జరిగే ప్రతిష్టాత్మక ఈ మెగాటోర్నికి ప్రధాన జట్లు సన్నద్ధం అవుతున్నాయి. రౌండ్ రాబిన్- నాకౌట్ పద్ధతిలో అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ICC) ఈ టోర్నమెంట్ నిర్వహిస్తుంది. మొత్తం 10 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది.
కాగా, ప్రపంచకప్ కు ముందు టీమిండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మొన్న జరిగిన ఆసియాకప్ టైటిల్ గెలిచిన భారత్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలివుండగానే గెలిచింది. మూడు వన్డేల సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
అయితే ప్రపంచకప్ లో ఈసారి టీమిండియా విజేతగా నిలుస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా అవతరించిన భారత్.. 2023 వరల్డ్ కప్ దక్కించుకునే అవకాశముందని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆస్ట్రేలియా టాప్ పొజిషన్ లో ఉందని.. అలాగే 2019 టైటిల్ నెగ్గిన ఇంగ్లండ్ ఆ సమయంలో నంబర్ వన్ ర్యాంకులో ఉందని గుర్తు చేస్తున్నారు. ఇదే సెంటిమెంట్ రిపీటయితే టీమిండియా 2023 వరల్డ్ కప్ విజేతగా నిలిచే అవకాశముందని అంటున్నారు ఫ్యాన్స్.
Also Read: టీమిండియా సరికొత్త రికార్డు.. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్-5 జట్లు ఇవే..
వన్డేలతో పాటు టి20, టెస్టులోనూ టీమిండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా టైటిల్ కొట్టాలని ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. ధావన్, రాహుల్, కోహ్లీ రికార్డు బద్దలు
Australia were No.1 Ranked and won the 2015 World Cup.
England were No.1 Ranked and won the 2019 World Cup.
India are now No.1 Ranked before the 2023 World Cup…!!! 🇮🇳 pic.twitter.com/hjZPA8Ftji
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 24, 2023