T20 World Cup 2026 : బంతితో మాయ చేసిన జేసన్ హోల్డర్.. వెస్టిండీస్ ముందు స్వల్ప లక్ష్యం
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా వెస్టిండీస్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి.
T20 World Cup 2026 WI vs NEP match West Indies target is 134
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా వెస్టిండీస్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. వెస్టిండీస్ బౌలర్లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 134 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
133 to defend#NepalCricket pic.twitter.com/W2dWsobujV
— CAN (@CricketNep) February 15, 2026
నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ (59; 47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాప్ సెంచరీ చేశాడు. సోంపాల్ కామి (26 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నేపాల్ ఓ దశలో 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దీపేంద్ర సింగ్ ఐరీ, సోంపాల్లు ఏడో వికెట్కు 54 పరుగులు జోడించి ఆదుకున్నారు.
వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు. అకేల్ హోసేన్, మాథ్యూ ఫోర్డే, షమర్ జోసెఫ్, రోస్టన్ చేజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
