IND vs AFG 3rd T20 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య బుధవారం రాత్రి బెంగళూరు చినస్వామి స్టేడియంలో 3వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరు జట్లు తలపడ్డాయి. మ్యాచ్ టై కావడంతో.. సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలి సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ టై కావడంతో రెండోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. రెండో సూపర్ ఓవర్లో భారత్ విజయంసాధించింది. రెండు సూపర్ ఓవర్లతో పాటు ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రోహిత్ శర్మ, రింకూసింగ్ సిక్సర్ల వర్షం.. విరాట్ కోహ్లీ సూపర్ ఫీల్డింగ్ వంటి విషయాలు ఈ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచాయి.
అంతర్జాతీయ క్రికెట్ లో ఒక మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు వేయడం ఇదే తొలిసారి.
ఐపీఎల్ 2020లో ఒకసారి ఇలా జరిగింది. పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో విజేతను నిర్ణయించేందుకు రెండు సూపర్ ఓవర్లు వేయాల్సి వచ్చింది.
అప్గాన్ వర్సెస్ ఇండియా టీ20లో ఇరు జట్లు 40 ఓవర్లలో 424 పరుగులు చేశాయి. ఇన్ని పరుగులు చేసిన తరువాత కూడా మ్యాచ్ టైగా మిగిలిపోయింది. దీంతో టై అయిన మ్యాచ్ లలో అత్యధిక పరుగులతో రెండో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా క్రైస్ట్ చర్చ్ టీ20 నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2010లో జరిగిన ఈ టీ20లో మొత్తం 428 పరుగులు చేశారు.
టీ20 ఇంటర్నేషనల్ లో అత్యధిక సెంచరీలు (5) సాధించిన రేసులో రోహిత్ శర్మ మళ్లీ అగ్రగామిగా నిలిచాడు.
రోహిత్ శర్మ, రింకూ సింగ్ మధ్య 190 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతర్జాతీయ టీ20లో భారత్ కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం.
2022లో ఐర్లాండ్ పై దీపక్ హుడా , సంజూ శాంసన్ మధ్య 176 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ రికార్డును ప్రస్తుతం రోహిత్ – రింకూ జోడీ బ్రేక్ చేసింది.
అఫ్గాన్ – ఇండియా టీ20లో భారత్ జట్టు చివరి రెండు ఓవర్లలో 58 పరుగులు చేసింది. టీ20 క్రికెట్ లో 19, 20 వ ఓవర్లలో అత్యధిక పరుగుల రికార్డు ఇదే.
చివరి ఓవర్లో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఓవర్ లో 36 పరుగులు రావడం ఇది నాల్గోసారి. ఇప్పటి వరకు 36కంటే ఎక్కువ పరుగులు రాలేదు.
ఇండియా – అఫ్గాన్ టీ20 మ్యాచ్ లో చివరి ఐదు ఓవర్లలో 103 పరుగులు వచ్చాయి. 16 నుంచి 20వ ఓవర్ వరకు అత్యధిక పరుగులు చేసిన పరంగా ఇది రెండో స్థానం.
Captain Rohit Sharma lifts the trophy and hands to Rinku Singh.