Virat Kohli : వారెవ్వా.. కోహ్లీనా మజాకా!.. బౌండరీ వద్ద అద్భుత ఫీల్డింగ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన విరాట్.. వీడియో వైరల్
నజీబుల్లా కొట్టిన తీరుకు అందరూ సిక్స్ అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ.. క్యాచ్ అందుకొనే ప్రయత్నం చేశాడు..

Virat Kohli
Virat Kohli Fielding Efforts : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య బుధవారం రాత్రి చినస్వామి స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉత్కంఠతతో ఊపేసింది. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. లక్ష్యం చాలా పెద్దదే అయినా అఫ్గానిస్థాన్ బ్యాటర్లు టీమిండియాతో అమితుమీకి సై అంటూ సమఉజ్జీలుగా నిలిచారు. చివరకు రెండో సూపర్ ఓవర్లో అఫ్గాన్ ను భారత్ జట్టు ఓడించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్ ఒకవైపు అయితే.. మ్యాచ్ చివరిలో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద చేసిన ఫీల్డింగ్ మరో అద్భుతమని చెప్పొచ్చు.
Also Read : Rohit Sharma : చిన్నస్వామిలో పలు రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. టీ20ల్లో సెంచరీల మోత
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 212 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టుకూడా 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఆ తరువాత విజేతను నిర్ధారించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్ లోనూ ఇరు జట్లు 16\1 తో సమంగా నిలవడడంతో రెండో సూపర్ ఓవర్లో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో బౌండరీలైన్ వద్ద విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ అద్భుతమని చెప్పొచ్చు. అఫ్గాన్ జట్టు 16.4 ఓవర్లో 165 పరుగుల వద్ద ఉంది. ఆ సమయంలో క్రీజులో ఉన్న నజీబుల్లా జద్రాన్ భారత్ బౌలర్ అవేశ్ ఖాన్ వేసిన బంతిని సిక్స్ గా మలిచే ప్రయత్నం చేశాడు.
నజీబుల్లా కొట్టిన తీరుకు అందరూ సిక్స్ అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ.. క్యాచ్ అందుకొనే ప్రయత్నం చేశాడు. అప్పటికే సమయం దాటిపోవటంతో బాల్ బౌండరీ లైన్ అవతలపడే సమయంలో గాల్లోకి ఎగిరి బాల్ ను మైదానంలోకి నెట్టేశాడు. దీంతో ఆరు పరుగులు వస్తాయనుకున్న అఫ్గాన్ బ్యాటర్ కు కోహ్లీ అద్భత ఫీల్డింగ్ తో ఒక్క పరుగుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కోహ్లీ ఫీల్డింగ్ తో బెంగళూరు స్టేడియంలోని ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. దీంతో స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాట్ తో రాణించలేక పోయాడు. క్రీజులో్కి వచ్చిన వెంటనే డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.
Excellent effort near the ropes!
How's that for a save from Virat Kohli ??
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4
— BCCI (@BCCI) January 17, 2024