Rohit Sharma : చిన్న‌స్వామిలో ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. టీ20ల్లో సెంచ‌రీల మోత‌

భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Rohit Sharma : చిన్న‌స్వామిలో ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. టీ20ల్లో సెంచ‌రీల మోత‌

Rohit Sharma

Updated On : January 17, 2024 / 9:06 PM IST

Rohit Sharma century : భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20ల్లో ఐదు సెంచ‌రీలు బాదిన ఏకైక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. బుధ‌వారం బెంగ‌ళూరులో అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20 మ్యాచులో శ‌త‌కం చేయ‌డం ద్వారా రోహిత్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ సిరీస్‌లో మొద‌టి రెండు టీ20 మ్యాచుల్లో డ‌కౌట్ అయిన రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లో చెల‌రేగిపోయాడు. ఆరంభంలో భార‌త్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చిన హిట్‌మ్యాన్ ఆత‌రువాత చెల‌రేగిపోయాడు.

త‌న దైన ట్రేడ్ మార్క్ షాట్ల‌తో మైదానం న‌లువైపులా భారీ షాట్లు ఆడాడు. మొత్తంగా 69 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 11 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో 121 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ శ‌త‌కంతో టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ యాద‌వ్‌, గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.

టీ20ల్లో అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన ఆట‌గాళ్లు..

రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 5 శ‌త‌కాలు
సూర్య‌కుమార్ (భార‌త్‌) – 4
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 4

ICC T20I Rankings : టీ20 ర్యాంకింగ్స్‌.. భారత ఆట‌గాళ్ల హవా.. య‌శ‌స్వి జైస్వాల్‌ 7, శివ‌మ్ దూబె 207 స్థానాలు ఎగ‌బాకి..

కోహ్లీ కెప్టెన్సీ రికార్డు బ్రేక్‌..

ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ మ‌రో ఘ‌న‌త‌ను సాధించాడు. టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో 44 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వద్ద రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్లు..

రోహిత్ శ‌ర్మ – 1647
విరాట్ కోహ్లీ -1570
ఎంఎస్ ధోని -1112

NZ vs PAK : ఏమ‌య్యా.. 16 సిక్స్‌లు కొట్టావ్‌.. ఇంకొక్కటి బాదుంటేనా..?