×
Ad

Rohit Sharma : ఏందీ సామీ ఇదీ.. ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే ఇలా ఔటైతివి.. ఇదే ఆఖ‌రి సిరీస్ అయ్యేలా ఉందే..

ఆసీస్‌తో తొలి వ‌న్డే మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ విఫ‌లం అయ్యాడు.

IND vs AUS 1st ODI Rohit Sharma Disappoints Out for 8

IND vs AUS : ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ విఫ‌లమ‌య్యాడు. 14 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్ సాయంతో 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్షా క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 13 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

ఇదే ఆఖ‌రి సిరీస్‌..?

టీ20లు, టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త్ ను విజేత‌గా నిలిచాడు. అయిన‌ప్ప‌టికి కూడా అత‌డిని ఆసీస్‌తో సిరీస్‌కు ముందు వ‌న్డే కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్‌కు ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ చెప్పారు.

Rohit Sharma : అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. ఐదో భార‌త ఆట‌గాడిగా..

దీంతో రోహిత్ శ‌ర్మ వ‌న్డే కెరీర్‌పై ఊహాగానాలు మొద‌లు అయ్యాయి. ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌లో విఫ‌లం అయితే ఇదే అత‌డికి ఆఖ‌రి సిరీస్ అవుతుంద‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు చెబుతున్నారు. కాగా.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ఆడ‌డం త‌న ల‌క్ష్యం అని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో రోహిత్ శ‌ర్మ వెల్ల‌డించాడు.

ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ తొలి వ‌న్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడి త‌న సత్తా త‌గ్గ‌లేద‌ని నిరూపించుకుంటాడ‌ని అంతా భావించారు. అయితే.. రోహిత్ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఇలాగే విఫ‌లం అయితే మాత్రం ఇదే ఆఖ‌రి సిరీస్ అయ్యే అవ‌కాశం ఉంది.