IND vs AUS 1st ODI Shubman Gill comments after India lost match to Australia
Shubman Gill : బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయామని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. పెర్త్ వేదికగా ఆదివారం ఆసీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. వరుణుడు పలు మార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో టీమ్ఇండియా 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) లు రాణించారు. విరాట్ కోహ్లీ (0), రోహిత్ శర్మ (8), శ్రేయస్ అయ్యర్ (11), శుభ్‌మన్ గిల్ (10) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్, వోవెన్, కునెమన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా స్టార్క్, ఎలిస్ చెరో వికెట్ తీశారు.
అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆసీస్ లక్ష్యాన్ని 131గా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37)లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ అనంతరం ఓటమి పై శుభ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడంతో తిరిగి పుంజుకోలేకపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. వర్షం అంతరాయం కలిగించిన ఇలాంటి మ్యాచ్‌ల్లో ఆటడం సవాల్‌తో కూడుకున్నదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన్పపటి కూడా చాలా విషయాలను నేర్చుకున్నట్లుగా తెలిపాడు.
Rohit Sharma : అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐదో భారత ఆటగాడిగా..
131 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోనేందుకు బౌలర్లు చాలా ప్రయత్నించారన్నాడు. సాధ్యమైనంత చివరి వరకు మ్యాచ్‌కు తీసుకువెళ్లారని, ఈ విషయంలో బౌలర్లను అభినందిస్తున్నట్లు చెప్పాడు. ఈ విషయంలో తాము సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఇక తాము ఎక్కడ ఆడినా కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది తమ అదృష్టమన్నాడు.