Womens World Cup 2025 : వర్షం కారణంగా పాక్, కివీస్ మ్యాచ్ రద్దు.. దక్షిణాఫ్రికా ఎలా సెమీస్‌కు చేరుకుందంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Womens World Cup 2025) దక్షిణాఫ్రికా సెమీస్‌లో అడుగుపెట్టిన రెండో జట్టుగా నిలిచింది.

Womens World Cup 2025 SA with this become the second team to qualify for the semis
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను వరుణుడు వదలడం లేదు. వర్షం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దు అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మ్యాచ్ కూడా రద్దైంది. కొలంబో వేదికగా శనివారం న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది.
దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ను కేటాయించారు. కాగా.. ఈ మ్యాచ్ రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.
IND vs AUS : రోహిత్ అలా.. కోహ్లీ ఇలా.. గంభీర్‌కు ఛాన్స్ ఇస్తున్నారుగా.. ఇక రిటైర్‌మెంటేనా?
దక్షిణాఫ్రికా సెమీస్‌కు ఎలా చేరుకుందంటే..?
ఈ టోర్నీలో (Womens World Cup 2025) ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా 5 మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్, నాలుగో స్థానంలో ఉన్న భారత్, ఐదో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌లకు 8 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉంది. అయితే.. ఈ మూడు జట్లు కూడా ఒకదానితో మరొకటి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో ఈ మూడు జట్లలో రెండు మాత్రమే 8 కంటే ఎక్కువ పాయింట్లతో సెమీస్ చేరుకుంటాయి. అలా జరిగినా కూడా టాప్-4లో దక్షిణాఫ్రికా ఉంటుంది. ఈనేపథ్యంలోనే సఫారీలు సెమీస్‌లో అడుగుపెట్టారు.
Rohit Sharma : అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐదో భారత ఆటగాడిగా..
బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.