IND vs AUS : రోహిత్ అలా.. కోహ్లీ ఇలా.. గంభీర్‌కు ఛాన్స్ ఇస్తున్నారుగా.. ఇక రిటైర్‌మెంటేనా?
ఆసీస్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs AUS ) రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలం అయ్యారు.

IND vs AUS 1st ODI Rohit Sharma and Virat Kohli Fails
IND vs AUS : టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌ను అందుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు 2027 వన్డే ప్రపంచకప్ సాధించి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఒకే ఒక ఫార్మాట్ ఆడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు అది అంత ఈజీ కాకపోవచ్చు.
ఈ మెగాటోర్నీకి మరో రెండున్నర రేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు వీరు ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను కాపాడుకోవడం అంత సులభమైన విషయం కాదు. వయసు వీరికి అడ్డంకి కానుంది. మరోవైపు వన్డే జట్టులో స్థానం కోసం కుర్రాళ్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్ వన్డే ప్రపంచకప్ 2027 పై దృష్టి పెట్టింది. ఈ టోర్నీలో ఆడే జట్టుపై స్పష్టత కోసం చూస్తోంది.
Rohit Sharma : అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐదో భారత ఆటగాడిగా..
Rohit Sharma out 💔💔💔💔💔
Josh Hazlewood strikes #RohitSharma𓃵 #INDvsAUS #AUSvIND pic.twitter.com/WaO0kE14qk
— राजपूत सवित सिंह (@Savit12) October 19, 2025
ఇప్పటికే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది బీసీసీఐ. దీంతో రో-కో ద్వయం వన్డే భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆసీస్‌తో సిరీస్ పైనే వీరిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మాజీ క్రికెటర్లు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రో-కో ద్వయం సత్తా చాటి తమలో సత్తా తగ్గలేదని, తాము వన్డే ప్రపంచకప్ 2027 రేసులో ఉన్నామని చెబుతారని అంతా ఆశించారు.
VIRAT KOHLI GONE FOR A DUCK!#AUSvIND pic.twitter.com/cg9GbcMRAE
— cricket.com.au (@cricketcomau) October 19, 2025
అయితే.. తొలి వన్డే మ్యాచ్‌లో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఘోరంగా విఫలం అయ్యారు. రోహిత్ శర్మ 8 పరుగులు చేసి హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక కోహ్లీ అయితే.. కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేదు. అతడు 8 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో షాట్ ఆడగా.. బ్యాక్‌వర్డ్ పాయింట్ లో కూపర్ కోనోలీ అద్భుత క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
ఇలాగైతే కష్టమే?
ఆసీస్‌తో మిగిలిన రెండు వన్డేల్లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విఫలం అయితే మాత్రం వారి వన్డే కెరీర్ ప్రశ్నార్థకమే అని చెప్పవచ్చు. యువ ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ ఎక్కువ సపోర్టు చేస్తాడనేది కానదలేని విషయం.