IND vs PAK : 15 రోజుల్లో 3 సార్లు ఓడిపోతారా.. భారత్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పాక్.. కెప్టెన్ ఫసక్?
భారత్ చేతిలో 15 రోజుల వ్యవధిలో పాక్ (IND vs PAK) మూడు సార్లు ఓడిపోవడంతో పీసీబీ కఠిన చర్యలకు సిద్ధమైంది.

PCB plans to replace T20I captain Salman Ali Agha after 3 losses to India in the Asia Cup 2025
IND vs PAK : ఆసియాకప్ 2025 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి తొమ్మిదో సారి ఆసియాకప్‌ను ముద్దాడింది. కాగా.. ఈ టోర్నీలో పాక్‌తో భారత్ (IND vs PAK ) మూడు సార్లు తలపడగా అన్నింటిలోనూ టీమ్ఇండియానే గెలిచింది. ఒకే టోర్నీలో 15 రోజుల వ్యవధిలో భారత్ చేతిలో మూడు సార్లు ఓడిపోవడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జీర్ణించుకోలేకపోతుంది.
ఈ క్రమంలో పీసీబీ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు పీటీఐ తెలిపింది. కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గానూ సల్మాన్ అలీ ఘోరంగా విఫలం అయ్యాడు. ఏడు మ్యాచ్‌ల్లో 80.90 స్ట్రైక్‌రేటుతో 72 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ షాదాబ్ షాన్ నియమించనున్నట్లు సమాచారం. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026 వరకు షాదాబ్ పాక్ జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
షాదాబ్ ఖాన్ ఎందుకు?
లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన షాదాబ్ ఖాన్ కు టీ20 క్రికెట్‌లో చాలా అనుభవం ఉంది. అంతేకాకుండా అతడు జట్టుకు సమతూకాన్ని తెస్తాడు. పాక్ తరుపున షాదాబ్ ఇప్పటి వరకు 112 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 18 సగటుతో 792 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 112 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగుల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు.
Shane Watson : ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనడం రోహిత్, కోహ్లీలకు అంత ఈజీ కాదు..
అయితే.. షాదాబ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఈ నెలాఖరున దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో లేదంటే వచ్చె నెలలో జరిగే అఫ్గానిస్థాన్, శ్రీలంక, పాక్ ట్రై సిరీస్ నాటికి జట్టుతో అతడు జట్టుతో చేరనున్నాడు. అతడు రాగానే అతడికే నాయకత్వ బాధ్యతలను పీసీబీ అప్పగించనుంది.