IND vs AUS : భార‌త్‌, ఆసీస్ వ‌న్డే సిరీస్‌.. మ్యాచ్‌ల‌ టైమింగ్‌, షెడ్యూల్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?

ఆదివారం నుంచి భార‌త్, ఆస్ట్రేలియా (IND vs AUS) జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs AUS : భార‌త్‌, ఆసీస్ వ‌న్డే సిరీస్‌.. మ్యాచ్‌ల‌ టైమింగ్‌, షెడ్యూల్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?

Do you know where to watch IND vs AUS ODI series free

Updated On : October 16, 2025 / 10:54 AM IST

IND vs AUS : వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌ను టీమ్ఇండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ (IND vs AUS) పై ప‌డింది. ఆదివారం (అక్టోబ‌ర్ 19న‌) నుంచి భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆడేందుకు శుభ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని భార‌త బృందం బుధ‌వారం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది.

టీ20లు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 త‌రువాత రో-కోలు ఆడ‌నున్న తొలి సిరీస్ ఇదే. కాగా.. ఈ సిరీస్‌లో రాణించ‌కుంటే వారి వ‌న్డే భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థక‌మ‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రు ఎలా ఆడతారు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

Shubman Gill : వ‌న్డే కెప్టెన్ అయిన త‌రువాత.. తొలిసారి రోహిత్ శ‌ర్మ‌ను క‌లిసిన‌ గిల్‌.. ఏం చేశాడో చూడండి..

ఎక్క‌డ చూడాలంటే..?

భార‌త్‌, ఆసీస్ వ‌న్డే సిరీస్ హ‌క్కుల‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ క‌లిగి ఉంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌లు ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి. ఇక ఓటీటీలో అయితే.. జియో హాట్ స్టార్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండు వేదిక‌ల్లోనూ మ్యాచ్‌లు చూడాలంటే స‌బ్‌స్ర్కిప్ష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జియో మొబైల్ యూజ‌ర్లు మాత్రం ప్ర‌త్యేక రిచార్జి ఫ్లాన్స్‌తో జియో హాట్ స్టార్ స‌బ్‌స్ర్కిప్ష‌న్ ను ఉచితంగా పొంద‌వ‌చ్చును.

భార‌త్ దేశం వెలుప‌ల జ‌రిగే మ్యాచ్‌ల‌ను దూర‌ద‌ర్శ‌న్ (డీడీ) స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా ప్ర‌సారం అవుతాయి అన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. కేబుల్, డీటీహెచ్ స‌ర్వీసుల్లో మాత్రం ఫ్రీగా రాదు. భూ ఆదారిత నెట్ వర్క్ (terrestrial network ) కనెక్షన్లలో మాత్రమే డీడీ స్పోర్ట్స్ ఫ్రీగా రానుంది.

ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మ‌హ్మ‌ద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్‌ కృష్ణ.

Virat Kohli-Rohit Sharma : కోహ్లీ, రోహిత్ క‌లిసి ఆసీస్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించే గోల్డెన్ ఛాన్స్‌..

వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి వన్డే – అక్టోబర్ 19 – పెర్త్ వేదిక‌గా
* రెండో వన్డే – అక్టోబర్ 23 – అడిలైడ్ వేదిక‌గా
* మూడో వన్డే – అక్టోబర్ 25 – సిడ్నీ వేదిక‌గా

ఈ మూడు మ్యాచ్‌లు భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.