Shane Watson : ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనడం రోహిత్, కోహ్లీలకు అంత ఈజీ కాదు..
సుదీర్ఘ విరామం తరువాత రోహిత్, కోహ్లీలు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం అత్యంత కఠిన సవాల్ అని షేన్ వాట్సన్ తెలిపాడు.

Its not to easy to Virat Kohli and Rohit Sharma to face Australia top bowlers Shane Watson
Shane Watson : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ సిరీస్‌లో ఆడనుండడంతో క్రికెట్ ప్రేమికుల దృష్టి ఈ సిరీస్‌పై నెలకొంది. ఈ సిరీస్‌లో వీరిద్దరు ఎలా రాణిస్తారో అన్న దానిపైనే అందరిలో ఆసక్తి నెలకొంది.
టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడారు. ఆ తరువాత వీరిద్దరు భారత్ తరుపున ఆడుతున్న సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లో రాణిస్తేనే వీరిని తదుపరి జరిగే వన్డే సిరీస్‌లకు ఎంపిక చేయనున్నారని, లేదంటే వీరికి ఇదే చివరి సిరీస్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.
Chiranjeevi-Tilak Varma : మన శంకర వరప్రసాద్ గారు సెట్ లో తిలక్ వర్మ.. ఫోటోలు..
అంత సులభం కాదు.. కఠిన సవాల్..
సుదీర్ఘ విరామం తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇది అత్యంత కఠినమైన సవాల్ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తెలిపాడు. ‘చాలా కాలం తరువాత మైదానంలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదు. ముఖ్యంగా అత్యుత్తమ పేసర్లు ఉన్న ఆస్ట్రేలియా వంటి జట్టును ఎదుర్కొనడం కఠినమైన సవాల్. వారిద్దరు లయను అందుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. వారు అత్యుత్తమ క్రికెటర్లు. కాబట్టి లయను అందుకోవడం పెద్ద కష్టం కాదు.’ అని వాట్సన్ అన్నాడు.
చివరి టూర్ కావొచ్చు..
ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి టూర్ కావొచ్చునని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలోని ప్రజలు కూడా వారి ఆటను ఎంతో ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలో వారిపై ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటారని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ఆటతీరును కనబరిచే ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు అని తెలిపాడు. అతడిలో పోటీతత్వం ఎక్కువన్నాడు. ఇక రోహిత్ విషయానికి వస్తే.. అతడు అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదు గొప్ప కెప్టెన్ అని అన్నాడు.