IND vs AUS : అట్లుంటది సిరాజ్‌తో పెట్టుకుంటే.. లబుషేన్, సిరాజ్ మధ్య ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

గర్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ సిరాజ్ దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. క్రీజులో ఉన్న లబుషేన్ కు తనదైన శైలిలో చిరాకు తెప్పించాడు.

Mohammed Siraj Marnus Labuschagne

Mohammed Siraj Marnus Labuschagne: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ గర్బా వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండోరోజు ఆదివారం మొదటి సెషన్స్ లో టీమిండియా బౌలర్ సిరాజుద్దీన్, ఆస్ట్రేలియా బ్యాటర్ లబుషేన్ మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. మ్యాచ్ తరువాత కూడా ఇరువురు ప్లేయర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ సిరాజ్ ను టార్గెట్ చేసుకున్నారు. దీంతో సిరాజ్ మైదానంలో కనిపిస్తే చాలు.. ‘బూ’ అంటూ పెద్దగా అరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: IND vs AUS: నితీశ్ రెడ్డి సూపర్ బౌలింగ్.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా.. వీడియో వైరల్

సిరాజ్, హెడ్ మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో ఐసీసీ సీరియస్ అయింది. దీంతో సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించిన విషయం తెలిసిందే. తాజా గర్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ సిరాజ్ దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. క్రీజులో ఉన్న లబుషేన్ కు తనదైన శైలిలో చిరాకు తెప్పించాడు. మహ్మద్ సిరాజ్ 33వ ఓవర్ బౌలింగ్ చేశాడు. క్రీజులో ఆస్ట్రేలియా బ్యాటర్ లుబుషేన్ ఉన్నాడు. ఆ ఓవర్లో రెండో బంతి వేసిన తరువాత సిరాజ్ వేగంగా లబుషేన్ వైపుకు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటర్ ఏదో చెబుతుండగా అవేవీ పట్టించుకోకుండా నేరుగా సిరాజ్ స్టంప్స్ దగ్గరికి వెళ్లాడు. స్టంప్ లపై ఉంచిన బెయిల్స్ స్థానాలను మార్పులు చేశాడు. సిరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో లబుషేన్ ఆ బెయిల్స్ ను అంతకుముందున్న స్థానాల్లోకి మార్పులు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: IND vs AUS: మూడో టెస్ట్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చిన బుమ్రా

అయితే, ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. రెండో రోజు ఆటలో క్రీజలోకి వచ్చిన లబుషేన్ మరో వికెట్ పడకుండా ఏకాగ్రతతో జాగ్రత్తగా ఆడుతున్నాడు. సిరాజ్ చేసిన పనికి అతను కాస్త ఇబ్బందిపడటంతో ఏకాగ్రత కోల్పోయి ఆ తరువాత ఓవర్లోనే అవుట్ అయ్యాడు. నితీశ్ రెడ్డి వేసిన బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి లబుషేన్ పెవిలియన్ బాటపట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. సిరాజ్ ట్రిక్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.