×
Ad

Abhishek Sharma : అయ్యో పాపం అభిషేక్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు తృటిలో మిస్‌..

టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) తృటిలో విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును మిస్ అయ్యాడు.

Ind Vs Aus 4th T20 Abhishek Sharma misses Virat Kohli All Time Record In T20s

Abhishek Sharma : టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ తృటిలో విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును మిస్ అయ్యాడు. గురువారం క్వీన్స్‌ల్యాండ్ వేదిక‌గా ఆసీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ‌ 21 బంతులు ఎదుర్కొన్నాడు. 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 ప‌రుగులు చేసి ఆడ‌మ్ జంపా బౌలింగ్ లో టిమ్ డేవిడ్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. అత‌డు ఈ మ్యాచ్‌లో మ‌రో 11 ప‌రుగులు సాధించి ఉంటే కోహ్లీ రికార్డును అందుకునేవాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. కాగా.. ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు అభిషేక్ (Abhishek Sharma) 39 ప‌రుగులు చేస్తే కోహ్లీతో స‌మానంగా 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త అందుకుని ఉండేవాడు.

Abrar Ahmed : హ్యాట్రిక్ తీశాన‌న్న ఆనందంలో పాక్ స్పిన్న‌ర్‌ అబ్రాద్ అహ్మ‌ద్‌.. నీ కంత సీన్ లేదంటూ షాకిచ్చిన థ‌ర్డ్ అంపైర్‌..

ఈ మ్యాచ్‌తో క‌లిపి అభిషేక్ శ‌ర్మ 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 27 ఇన్నింగ్స్‌ల్లో 37 స‌గ‌టు 192.2 స్ట్రైక్‌రేటుతో 989 ప‌రుగులు సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత‌డు వెయ్యి ప‌రుగుల మైలురాయిని చేరుకునేందుకు మ‌రో 11 ప‌రుగులు అవ‌స‌రం. ఆసీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ ఈ ఘ‌న‌త సాధించే అవ‌కాశం ఉంది. అప్పుడు కోహ్లీ త‌రువాత రెండో స్థానంలో నిలుస్తాడు. ప్ర‌స్తుతం కోహ్లీ త‌రువాతి స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ 29 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

టీమ్ఇండియా త‌రుపున టీ20ల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు చేసిన బ్యాట‌ర్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 27 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ – 29 ఇన్నింగ్స్‌ల్లో
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 31ఇన్నింగ్స్‌ల్లో