×
Ad

IND vs AUS 4th T20 : రాణించిన శుభ్‌మ‌న్ గిల్‌.. ఆసీస్ ల‌క్ష్యం ఎంతంటే ?

క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ వేదిక‌గా ఆసీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో (IND vs AUS 4th T20) భార‌త ఇన్నింగ్స్ ముగిసింది.

IND vs AUS 4th T20 Australia target is 168

IND vs AUS 4th T20 : భార‌త్, ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ వేదిక‌గా నాలుగో టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో (IND vs AUS 4th T20) టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అభిషేక్ శ‌ర్మ (28; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), శివ‌మ్ దూబె (22; 18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), సూర్య‌కుమార్ యాద‌వ్ (20; 10 బంతుల్లో 2 సిక్స‌ర్లు) ప‌ర్వాలేద‌నిపించారు. ఆఖ‌రిలో అక్ష‌ర్ ప‌టేల్ (21 నాటౌట్ 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు.

మిగిలిన వారిలో జితేశ్ శ‌ర్మ (3), తిల‌క్ వ‌ర్మ (5)లు విఫ‌లం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా, నాథ‌న్ ఎల్లిస్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. జేవియర్ బార్ట్‌లెట్, మార్క‌స్ స్టోయినిస్ త‌లా ఓ వికెట్ సాధించారు.