credit @ bcci twitter
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4) లు క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత్ ఇంకా 310 పరగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్‌ను తప్పించుకోవాలంటే భారత్ ఇంకో 111 పరుగులు చేయాలి.
మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ (3) తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. వన్‌డౌన్ వచ్చిన కేఎల్ రాహుల్ (24) కాసేపు క్రీజులో పాతుకుపోయాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (82) చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఆ తరువాత విరాట్ కోహ్లీ (36)తో కలిసి నాలుగో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో యశస్వి తన టెస్టు కెరీర్‌లో 9వ అర్థశతకాన్ని నమోదు చేశాడు. మరో అరగంటలో ఆట ముగుస్తుందనగా.. యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. మిడాన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం పరిగెత్తగా కోహ్లీ వద్దని చెప్పడంతో వెనక్కి వెళ్లేలోపు రనౌట్ అయ్యాడు. దీంతో సెంచరీ చేసే అవకాశాన్ని యశస్వి కోల్పోయాడు.
అటు కోహ్లీ సైతం తన ఆఫ్ సైడ్ బలహీనతను మరోసారి బయటపెడుతూ పెవిలియన్‌కు చేరుకున్నాడు. నైట్‌వాచ్ మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ (0) డకౌట్ అయ్యాడు. రిషబ్ పంత్, జడేజాలు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
AUS vs IND : సెంచరీతో భారత్‌పై సరికొత్త రికార్డును నమోదు చేసిన స్టీవ్ స్మిత్
Stumps on Day 2 in Melbourne!#TeamIndia move to 164/5, trail by 310 runs
Updates ▶️ https://t.co/njfhCncRdL#AUSvIND pic.twitter.com/9ZADNv5SZf
— BCCI (@BCCI) December 27, 2024