Steve Smith unlucky dismissal : పాపం స్టీవ్ స్మిత్.. ఇలా ఔట్ అవుతాడని కలలో కూడా ఊహించి ఉండడు.. వీడియో వైరల్..
తొలి ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ విచిత్రకర రీతిలో ఔట్ అయ్యాడు.

Credit @ ScreenGrab x.com
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఫామ్ అందుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్నబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన అనంతరం అతడిని దురదృష్టం వెంటాడింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో అతడు విచిత్రకర రీతిలో ఔట్ అయ్యాడు. ఇలా ఔట్ అవుతానని అతడు కలలో కూడా ఊహించి ఉండడు.
ఆసీస్ ఇన్నింగ్స్ 115 వ ఓవర్‌ను ఆకాశ్ దీప్ వేశాడు. ఈ ఓవర్‌లోని మొదటి బంతికి స్మిత్ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకింది. ఆ పై అతడి ప్యాడ్లను తాకి కింద పడి వికెట్లను పడగొట్టింది. దీన్ని చూసిన స్మిత్ ఎంతో నిరాశచెందాడు. మంచి లయలో ఉన్న అతడి ఊపు చూస్తుంటే అలవోకగా డబుల్ సెంచరీ చేసే అవకాశాలు ఉండగా విచిత్ర రీతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
భారీ శతకం చేసిన అతడికి ప్రేక్షకులు స్టాండింగ్ ఓపెషన్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో స్మిత్ 197 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 140 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్ (72) సామ్ కొన్‌స్టాస్ (60) ఖవాజా (57) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. జడేజా మూడు, ఆకాశ్‌దీప్ రెండు, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ రోహిత్ శర్మ 3 పరుగులకే చేసి ఔట్ అయ్యాడు. మరికాసేపటికే టీ విరామం ఆఖరి బంతికి 24 పరుగులు చేసిన రాహుల్ సైతం పెవిలియన్‌కు చేరుకున్నాడు. రెండో రోజు టీ విరామానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (23), కోహ్లీ (0) ఉన్నారు.
An unfortunate dismissal for Steven Smith, but a sensational knock. 🙇♂️pic.twitter.com/r2efuLvq4h
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2024