IND vs AUS : స్టీవ్ స్మిత్ బాక్స్ బద్దలైంది.. బాధతో గింగిరాలు తిరిగిన స్మిత్.. సూపర్ బాల్ ఆకాశ్..
తొలి రోజు ఆటలో స్టీవ్ స్మిత్ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Steve Smith endures painful blow on the box in the boxing day test
ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ తనకు అచ్చొచ్చిన మెల్‌బోర్న్ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్నాడు. శతకంతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్ (15) క్రీజులో ఉన్నారు. అయితే.. తొలి రోజు ఆటలో స్టీవ్ స్మిత్ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆకాశ్ దీప్ వేసిన బంతి అతడికి తాకరాని చోట తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 83వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను ఆకాశ్ దీప్ వేశాడు. చివరి బంతిని షార్ట్ ఆఫ్ లెంగ్త్‌లో బౌల్ చేశాడు. స్మిత్ దీన్ని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బాల్ స్వింగ్ కాకుండా స్ట్రైయిట్‌గా వచ్చింది.
Virat Kohli Fined : విరాట్ కోహ్లీ పై ఐసీసీ కఠిన చర్యలు.. భారీ జరిమానా ఇంకా..
ఆ బాల్ నేరుగా స్మిత్ రెండు కాళ్ల మధ్యలో గజ్జ ప్రాంతంలో తగిలింది. దీంతో నొప్పితో స్మిత్ విలవిలలాడాడు. తేరుకున్న తరువాత చాలా మంచి బంతి వేశావ్ అంటూ ఆకాశ్‌ను మెచ్చుకున్నాడు.
నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగిన భారత్..
రెండో రోజు ఆటలో భారత జట్టు ఆటగాళ్లు చేతికి నల్లరిబ్బన్లను ధరించి బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాత్రి 9 గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. భారతదేశ ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ఆయన దేశానికి సేవలు అందించారు. మనోహ్మన్ మృతికి సంతాపంగా భారత క్రికెటర్లు నల్ల రిబ్బన్లను చేతికి కట్టుకున్నారు.
Special comments from Steve Smith after being hit in a certain area 🫣#AUSvIND pic.twitter.com/RcNRVKHrFH
— 7Cricket (@7Cricket) December 26, 2024