Rohit Sharma fail : ఓపెనర్‌గానూ రోహిత్ శర్మ విఫలం.. వదిలేసే బంతిని ఆడి.. రిటైర్‌మెంట్ సమయం ఆసన్నమైందా?
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు.

Rohit Sharma woeful form continues
Rohit Sharma woeful form continues : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ రెండో ఓవర్ ఆఖరి బంతికి ఔట్ అయ్యాడు.
పాట్ కమిన్స్ ఆఫ్ సైడ్ బౌన్సర్ వేయగా దాన్ని ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు హిట్‌మ్యాన్. అయితే.. బాల్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేవగా బొలాండ్ ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 5 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ ఔట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
AUS vs IND : సెంచరీతో భారత్‌పై సరికొత్త రికార్డును నమోదు చేసిన స్టీవ్ స్మిత్
తొలి టెస్టు మ్యాచ్‌లో వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ ఆడలేదు. కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడడంతో అతడికి ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు హిట్‌మ్యాన్. రెండు, మూడో టెస్టులో ఆరో స్థానంలో బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాగా.. నాలుగో టెస్టులో తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో వచ్చినప్పటికి విఫలం అయ్యాడు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (18), కేఎల్ రాహుల్ (13) లు క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది.
గత 14 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే..
గత 14 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఒక్క సారి మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. ఇక మూడు అంకెల సంఖ్య గురించి చెప్పాల్సిన పని లేదు. 14 ఇన్నింగ్స్‌ల్లో 11.07 సగటుతో 155 పరుగులు మాత్రమే చేశాడు. పద్నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు ఆడింది చాలని, ఇక రిటైర్‌మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
అటు టీమ్ఇండియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలు రోహిత్ శర్మ కెప్టెన్సీ పై మండిపడుతున్నారు. మైదానంలో సరైన వ్యూహాలు అమలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడని, ఫీల్డింగ్ సెటప్ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Captain gets captain at the MCG.
– Cummins gets Rohit!pic.twitter.com/LwT4pkldtn
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2024
Rohit Sharma in Last 14 Innings
6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3Runs : 155
Average : 11.07Time for Retirement from Test format!#INDvsAUS pic.twitter.com/A1DBQmBbQs
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) December 27, 2024