IND vs AUS 5th T20 Tilak Varma and Abhishek Sharma eye on 1000 international T20 runs
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో ప్రస్తుతం భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. మరోవైపు చివరి మ్యాచ్‌లో (IND vs AUS ) గెలిచి సిరీస్‌ను 2-2 తో సమం చేయాలని ఆసీస్ పట్టుదలగా ఉంది.
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 11 పరుగులు, తిలక్ వర్మ నాలుగు పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకుంటారు.
2024లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు ఆడాడు. 27 ఇన్నింగ్స్‌ల్లో 36.6 సగటు 189.8 స్రైక్‌రేటుతో 989 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఆరు అర్థశతకాలు ఉన్నాయి.
ఇక తిలక్ వర్మ విషయానికి వస్తే.. 2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు ఆడాడు. 33 ఇన్నింగ్స్‌ల్లో 47.4 సగటు 146.7 స్ట్రైక్‌రేటుతో 996 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్థశతకాలు ఉన్నాయి.