IND vs AUS
IND vs AUS : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. రెండు జట్లు కూడా ప్రాక్టీస్‌ను మొదలెట్టాయి. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా, మిచెల్ మార్ష్ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
ఈ వన్డే సిరీస్ లో చాలాకాలం తరువాత భారత జట్టు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు వన్డే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోహిత్, కోహ్లీ టీం సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రాక్టీస్ సెషన్ సైతం మొదలు పెట్టారు. అయితే, విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. దీంతో ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ తోటి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ.. డ్యాన్స్ చేస్తూ.. సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కోహ్లీ ఉంటే అట్లుంటది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
VIRAT KOHLI – THE BIGGEST ENTERTAINER…!!! 😂❤️ pic.twitter.com/7MUIV2vqhi
— Johns. (@CricCrazyJohns) October 17, 2025
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
♦ తొలి వన్డే : అక్టోబర్ 19 (పెర్త్ వేదికగా)
♦ రెండవ వన్డే : అక్టోబర్ 23 (అడిలైడ్)
♦ మూడో వన్డే : అక్టోబర్ 25 (సిడ్నీ )
మ్యాచ్ ఆరంభ సమయం : భారత కాలమానం ప్రకారం ఉదయం 9గంటలకు మ్యాచ్ ఆరంభం.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్
♦ తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్‌బెర్రా
♦ రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్
♦ మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్
♦ నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్
♦ ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.
♦ మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్‌లు ఆరంభం.