Rohit Scolds Jaiswal: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆసీస్ బ్యాటర్లు భారత బౌలర్ల ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు. 65 ఓవర్లకు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 237 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (72), స్టీవ్ స్మిత్ (42) లు క్రీజులో ఉన్నారు.
మైదానంలో రోహిత్ శర్మ చాలా అలర్ట్‌గా ఉంటాడు. ఫీల్డర్లు ఏదైన తప్పు చేస్తే తనదైన శైలిలో సరదాగానే మందలిస్తూ ఉంటాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా బాక్సింగ్ డే టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను రోహిత్ మందలించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IND vs AUS : కోహ్లీ పై నిషేదం..? సిడ్నీ టెస్టు ఆడడా?
ఉస్మాన్ ఖవాజా ఔటైన తరువాత స్టీవ్ స్మిత్ మైదానంలో అడుగుపెట్టాడు. అతడు రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఓ బంతిని డిఫెన్స్ ఆడాడు. ఈ బంతి స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ వద్దకు వెళ్లింది. అయితే.. బాల్ ఆపేందుకు ప్రయత్నించని యశస్వి, తనను తాను రక్షించుకునేందుకు పక్కకు జరిగాడు. దీన్ని గమనించిన రోహిత్ శర్మ వెంటనే ఇలా అన్నాడు.
ఏయ్ జైస్వాల్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నవా ఏంటి ? అని మండిపడ్డాడు. ఆ తరువాత మరోసారి కూడా జైస్వాల్‌ను మందలించాడు రోహిత్. ఫీల్డింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు మోకాళ్ల నిలబడి ఉండడాన్ని చూస్తునే ఉంటాం. అయితే.. యశస్వి నిటారుగా నిలబడి ఉండగా.. ఫీల్డింగ్ సరిగ్గా చేయ్.. బంతిని ఆడే వరకు మోకాళ్ల పైనే ఉండు అంటూ అని అరిచాడు. రోహిత్ శర్మ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి.
IND vs AUS : మెల్‌బోర్న్‌లో నేనేంటో చూపిస్తా : విరాట్ కోహ్లీ..
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) December 26, 2024