IND vs AUS Steven Smith falls one short of landmark 10000 Test runs
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. సిడ్నీ టెస్టులో విజయం సాధించి 3-1 తేడాతో భారత్ పై గెలుపొందింది. 162 పరుగుల లక్ష్యాన్ని 27 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది ఆస్ట్రేలియా. పదేళ్ల తరువాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే.. ఒక్క స్టీవ్ స్మిత్ మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నాడు. అతడు ఈ మ్యాచ్‌లో మరొక్క పరుగు చేసి ఉంటే అతడి ఆనందం రెట్టింపు అయ్యేది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 33 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేస్తే టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకునే వాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో 9 బంతులు ఆడిన స్మిత్ 4 పరుగులు మాత్రమే చేశాడు.
అతడు నాలుగు పరుగులు చేసిన తరువాత.. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ స్మిత్ 10 వేల పరుగు కోసం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తుండగా వారికి గట్టి షాక్ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ షాట్ ఆడేందుకు స్మిత్ ప్రయత్నించగా బంతి కాస్త బౌన్స్ అయింది బ్యాట్‌కు తగిలింది. స్లిప్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దీంతో స్మిత్ నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Sunil Gavaskar: బీజీటీ ప్రజెంటేషన్‌లో గావస్కర్‌ను అవమానించిన ఆస్ట్రేలియా.. ఆయన ఏమన్నారంటే?
ప్రతిష్టాత్మకమైన సిరీస్‌లో భారత్ వంటి జట్టు పై తన కెరీర్ చిరస్మరణీయంగా నిలిచే మైలుస్టోన్‌ని సాధించి ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలాంటి అరుదైన సందర్భాన్ని స్మిత్ కోల్పోయాడు. అయితే.. అతడు ఈ నెలలోనే ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. ఈ నెల చివరల్లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆ పర్యటనలో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ గాలె వేదికగా జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో స్మిత్ 10వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
స్టీవ్ స్మిత్ ఇప్పటి వరకు 114 టెస్టుల్లో 55.9 సగటుతో 9999 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 41 అర్థశతకాలు ఉన్నాయి.
Gambhir: రోహిత్-కోహ్లీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఏమన్నాడంటే?
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 14 మంది ఆటగాళ్లు మాత్రమే 10వేల పరుగులు మైలురాయిని చేరుకున్నారు. స్మిత్ మరో పరుగు చేస్తే ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.
ఇప్పటి వరకు టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే..
1. సచిన్ టెండూల్కర్ (భారత్) – 15921 పరుగులు
2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13378 పరుగులు
3. జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 13289 పరుగులు
4. రాహుల్ ద్రవిడ్ (భారత్) – 13288 పరుగులు
5 .జో రూట్ (ఇంగ్లాండ్) – 12972 పరుగులు
6. అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 12472 పరుగులు
7. కుమార సంగక్కర (శ్రీలంక) – 12400 పరుగులు
8. బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 11953 పరుగులు
9. శివనారాయణ్ చంద్రపాల్ (వెస్టిండీస్) – 11867 పరుగులు
10. మహేలా జయవర్థనే (శ్రీలంక) – 11814 పరుగులు
11. అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) – 11174 పరుగులు
12. స్టీవా (ఆస్ట్రేలియా) – 10927 పరుగులు
13. సునీల్ గవాస్కర్ (భారత్) – 10122 పరుగులు
14. యూనిస్ ఖాన్ (పాకిస్థాన్) -10099 పరుగులు
Steven Smith dismissed on 9,999 Test runs.
– Prasidh Krishna on fire!pic.twitter.com/M1diOrOvGX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 5, 2025