Gambhir: రోహిత్-కోహ్లీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఏమన్నాడంటే?
సిడ్నీ టెస్టు ఓటమి తరువాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంకు హాజరై మాట్లాడారు. ఈ క్రమంలో జట్టులో సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ శర్మలపై ..

Gautam Gambhir reacts on Rohit and Kohli retirement
Gautam Gambhir: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమి పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టుకు విజయావకాశాలు ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవటంతో ఆటగాళ్లు వైఫల్యం చెందారు. బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమయ్యారు. తాజా విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు వెళ్లింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరుకున్న విషయం తెలిసిందే.
Also Read: IND vs AUS: చేతులెత్తేసిన టీమిండియా.. ఐదో టెస్టులోనూ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా
సిడ్నీ టెస్టు ఓటమి తరువాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మీడియా సమావేశంకు హాజరై మాట్లాడారు. ఈ క్రమంలో జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (virat kohli), రోహిత్ శర్మ (Rohit sharma)లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ గురించి గంభీర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో గంభీర్ స్పందిస్తూ.. నేను ఏ ఆటగాడి భవిష్యత్తు పై వ్యాఖ్యలు చేయను. అది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వారిలో తపన, నిబద్ధత ఉంటే, వారు భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనవి చేస్తారు. ప్రతిఒక్కరూ అందుబాటులో ఉంటే దేశవాలీ క్రికెట్ ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను అని గంభీర్ పేర్కొన్నారు. భారత్ జట్టుకు ఇప్పట్లో టెస్టులు లేవు. జూన్ – జూలై నెలలో ఇంగ్లాండ్ లో తదుపరి టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఐదు నెలల తరువాత జట్టు భవిష్యత్తు గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని గంభీర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Also Read: Rishabh Pant : పంత్ కాక.. టెస్టు అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఆ కొట్టుకు ఏందీ సామీ..
సిడ్నీ టెస్టులో బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే ఇండియా గెలిచే అవకాశాలు ఉండేవా అనే ప్రశ్నకు గంభీర్ స్పందించారు. బుమ్రా ఉండిఉంటే సిడ్నీ టెస్టులో టీమిండియా గెలిచేదని నేను అనను. కానీ, అతడు ఉంటే బాగుండేది. మాకు ఐదుగురు బౌలర్లు ఉన్నారు. మంచి జట్టు ఉంది. ఏ ఒక్కరిపై ఆదారపడం. తొలి ఇన్నింగ్స్ లో 181 కొట్టినా ఆధిక్యం దక్కించుకున్నాం. అయితే, రెండో ఇన్నింగ్స్ లో మేము ఆస్ట్రేలియాకు 250 వరకు టార్గెట్ ఇచ్చిఉంటే బాగుండేది. అప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ మెరుగుపడాల్సి ఉందంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.
Also Rad: Vinod Kambli : ఆస్పత్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్.. టీమ్ఇండియా జెర్సీ ధరించి..
డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్ల మధ్య విభేదాల అంటూ వస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు గంభీర్ మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ రూమ్ ను సంతోషంగా ఉంచడానికి నేను ప్రతిఒక్కరితో మాట్లాడతాను. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడి నుంచి సుదీర్ఘ అనుభవం కలిగిన ఆటగాడి వరకు అందరితోనూ ఒకేవిధంగా ఉంటా. అందరితోనూ నిజాయితీగా ఉంటూ ప్రతీఒక్కరిని సమానంగా చూస్తానని గంభీర్ పేర్కొన్నారు.