IND vs AUS: చేతులెత్తేసిన టీమిండియా.. ఐదో టెస్టులోనూ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ఆస్ట్రేలియా

IND vs AUS: చేతులెత్తేసిన టీమిండియా.. ఐదో టెస్టులోనూ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ఆస్ట్రేలియా

Teamindia

Updated On : January 5, 2025 / 9:33 AM IST

IND vs AUS 5th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరిగింది. 3-1తో సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. చివరి టెస్టు శుక్రవారం సిడ్నీలో ప్రారంభంకాగా.. ఇవాళ మూడోరోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు ఆసీస్ కు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాటర్లు కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఐదో టెస్టులోనూ ఆసీస్ ఘన విజయం సాధించింది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో జూన్ నెలలో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు తలపడనున్నాయి.

 

ఇండియా ఆడిన లాస్ట్ ఎనిమిది టెస్టుల్లో కేవలం ఒక్క టెస్టులో మాత్రమే విజయం సాధించింది. ఆరు టెస్టుల్లో ఓడిపోగా.. ఒక టెస్టును డ్రా చేసుకుంది. ఇండియా వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ లలోనూ టీమిండియా ఓడిపోయింది. ప్రస్తుతం బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ లలో మూడింటిలో టీమిండియా ఓడిపోగా.. ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రా అయింది.
ఇదిలాఉంటే.. ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను టీమిండియా బౌలర్ జస్ర్పీత్ బుమ్రా దక్కించుకోగా.. సిడ్నీ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ దక్కించుకున్నాడు.

 

సిడ్నీ టెస్టు స్కోర్ బోర్డు..
భారత్ జట్టు
తొలి ఇన్నింగ్స్ – 185.
రెండో ఇన్నింగ్స్ – 157
ఆస్ట్రేలియా జట్టు
తొలి ఇన్నింగ్స్ – 181
రెండో ఇన్నింగ్స్ – 162/4

 

♦ భారత్ తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్(40), జడేజా (26) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా నిలవగా.. ఆసీస్ బౌలర్లు స్కాట్ బోలాండ్ 4/31, మిచెల్ స్టార్క్ 3/49 వికెట్లు తీశారు.

♦ భారత్ రెండో ఇన్నింగ్స్ .. రిషబ్ పంత్ (61), యశస్వీ జైస్వాల్ (22) అత్యధిక స్కోరర్లుగా నిలవగా.. ఆసీస్ బౌలర్లు స్కాట్ బోలాండ్ 6/45, పాట్ కమ్మిన్స్ 3/44 వికెట్లు తీశారు.

♦ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో.. బ్యూ వెబ్ స్టర్ (57), స్టీవ్ స్మిత్ (33). టీమిండియా బౌలర్లు ప్రసిద్ కృష్ణ 3/42, మహమ్మద్ సిరాజ్ 3/51.

♦ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో.. ఉస్మాన్ ఖవాజా (41), బ్యూ వెబ్ స్టర్ (39 నాటౌట్). టీమిండియా బౌలర్లు ప్రసిద్ కృష్ణ 3/65, మహ్మద్ సిరాజ్ 1/69 వికెట్లు పడగొట్టారు.