Rishabh Pant : పంత్ కాక‌.. టెస్టు అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఆ కొట్టుకు ఏందీ సామీ..

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Rishabh Pant : పంత్ కాక‌.. టెస్టు అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఆ కొట్టుకు ఏందీ సామీ..

IND vs AUS 5th Test Pant scores second fastest Test fifty by an Indian

Updated On : January 4, 2025 / 12:19 PM IST

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో రెండో వేగ‌వంత‌మైన అర్థ‌శ‌త‌కం న‌మోదు చేశాడు. సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ కేవ‌లం 29 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కాన్ని సాధించాడు. ఈ క్ర‌మంలో క‌పిల్ దేవ్ రికార్డును అధిగ‌మించాడు. 1982లో పాకిస్థాన్ పై క‌పిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచ‌రీని చేశాడు.

ఇక టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాడి రికార్డు కూడా పంత్ పేరిటే ఉంది. 2022లో శ్రీలంక పై అత‌డు 28 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కాన్ని బాదాడు.

Virat Kohli : అదే నిర్ల‌క్ష్యం.. విరాట్ కోహ్లీ మ‌ళ్లీ విఫ‌లం.. ఇక రిటైర్‌మెంటే..?

టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్లు..
రిష‌బ్ పంత్ – 28 బంతుల్లో – శ్రీలంక‌పై (2022లో)
రిష‌బ్ పంత్ – 29 బంతుల్లో – ఆస్ట్రేలియా పై (2025లో)
క‌పిల్ దేవ్ – 30బంతుల్లో – పాకిస్థాన్ పై (1982లో)
శార్దూల్ ఠాకూర్ – 31 బంతుల్లో – ఇంగ్లాండ్ పై (2021లో)
య‌శ‌స్వి జైస్వాల్ – 31 బంతుల్లో – బంగ్లాదేశ్ పై (2024లో)

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. సిడ్నీ టెస్టులో పంత్ వీర‌విహారం చేశాడు. టీ20 త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు. కేవ‌లం 33 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 61 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్ర‌స్తుతం భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగులు చేసింది. నితీశ్‌కుమార్ రెడ్డి (4), ర‌వీంద్ర జ‌డేజా (2) లు క్రీజులో ఉన్నారు.

Jasprit Bumrah : ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. 46 ఏళ్ల రికార్డు బ్రేక్‌..

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 4 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. కాగా.. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 185 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం భార‌త్ 132 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.