sanju samson: ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు కొట్టిన సంజూ శాంసన్ .. వీడియో వైరల్

బంగ్లాదేశ్ బౌలర్ రిషద్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తొలి బంతి మినహా మిగిలిన ఐదు బంతులను సంజూ శాంసన్ సిక్సర్లుగా మిలిచాడు.

Sanju Samson

sanju samson five sixes video: బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మూడో మ్యాచ్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఫలితంగా 133 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న సంజూ.. 111 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సులు ఉన్నాయి.

Also Read: IND vs BAN: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ లో నమోదైన రికార్డులు ఇవే..

బంగ్లాదేశ్ బౌలర్ రిషద్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తొలి బంతి మినహా మిగిలిన ఐదు బంతులను సంజూ శాంసన్ సిక్సర్లుగా మిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సంజూ భాయ్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: IND vs BAN: ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత.. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర్ నమోదు

ఈ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 297 భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సంజూ శాంసన్ కు అవార్డు దక్కింది.