ఆకాశ్ దీప్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన హ్యారీ బ్రూక్.. ఏం జరిగిందో అర్ధంకాక ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది.

IND vs ENG 3rd test

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నాలుగో రోజు (ఆదివారం) ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. చివరి రోజు (సోమవారం) తొలి గంటలో రాహుల్, పంత్ ఎలా ఆడతారన్నదే మ్యాచ్‌లో కీలకం కానుంది. వీరిద్దరిలో ఎవరు క్రీజులో పాతుకుపోయినా భారత జట్టు విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఐదోరోజు ఆటలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్‌లో నెలకొంది.

Also Read: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ షాకింగ్ ప్రకటన.. కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ ..

నాలుగో రోజు (ఆదివారం) టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో పాతుకుపోకుండా వెంటవెంటనే వికెట్లు తీశారు. రూట్, స్టోక్స్ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నం చేయగా.. వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అద్భుత బౌలింగ్ తో చకచకా వికెట్లు పడగొట్టి టీమిండియాను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత బుమ్రాసైతం విజృంభించడంతో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ 192 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆకాశ్ దీప్, బుమ్రా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో ఆకాశ్‌ దీప్ అద్భుత బంతితో హ్యారీ బ్రూక్‌ను పెవిలియన్ బాటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇంగ్లాండ్ 87 పరుగుల వద్ద ఆకాశ్ దీప్ వేసిన 22వ ఓవర్లో హ్యారీ బ్రూక్ (23) పెవిలియన్ బాటపట్టాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని హ్యారీ బ్రూక్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడంతో బంతి బ్యాట్‌ను తాకకుండా నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ను లేపేసింది. ఆ సమయంలో హ్యారీ బ్రూక్‌కు ఏం జరిగిందో అర్ధంకాక బిత్తర చూపులు చూస్తుండిపోయాడు. అసలు నేను ఎలా ఔట్ అయ్యాను.. అన్నట్లుగా బ్రూక్ చూస్తూ ఉండిపోయాడు. వెంటనే తేరుకొని పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు.. హ్యారీ బ్రూక్ వికెట్‌ తీసిన అనంతరం ఆకాశ్ దీప్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.