బుమ్రా దెబ్బకు బిత్తరపోయిన జో రూట్.. పాపం.. బాల్ వికెట్లను ఎలా తాకిందో అర్ధంకాక ఏం చేశాడంటే.. వీడియో వైరల్..

రెండో రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేక ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.

IND vs ENG 3rd test

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. రెండో రోజు (శుక్రవారం) ఆటలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా విజృంభణతో ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేక పోయారు. వరుసగా వికెట్లు కోల్పోయారు. ఫలితంగా 387 పరుగుల వద్దే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. కళ్లు చెదిరే బౌలింగ్ తో వరుస ఓవర్లలో ముగ్గురు బ్యాటర్లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.

Also Read: Eng Vs Ind: చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్..

బూమ్రా బౌలింగ్ ధాటికి బెన్ స్టోక్స్ (44) ఔట్ కాగా.. సెంచరీ హీరో జో రూట్ (104) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రిస్ వోక్స్ డకౌట్ కాగా.. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ 20 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో ఒక వికెట్ తీసిన బుమ్రా.. రెండో రోజు ఆటలో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపీల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు.


రెండో రోజు మొత్తం 29.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. తొలిరోజు 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిలిచిన రూట్.. రెండో రోజు (శుక్రవారం) ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, బుమ్రా బౌలింగ్ ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు. బుమ్రా అతణ్ని అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు.


బంతి ఊహించని రీతిలో టర్న్ అయ్యి నేరుగా వికెట్లను తాకింది. ఏం జరిగిందో అర్ధంకాక జో రూట్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. వెంటనే తేరుకొని నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. మరోవైపు వోక్స్ (0)సైతం బుమ్రా బంతికి తాళలేక బౌల్డ్ అయ్యాడు.