Eng Vs Ind: చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్..
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీతో (104) చెలరేగాడు.

Eng Vs Ind: మూడో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 251/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును భారత స్టార్ బౌలర్ బుమ్రా గట్టి దెబ్బకొట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. బుమ్రా మొత్తం 5 వికెట్లు తీశాడు.
భారత బౌలర్లలో నితీశ్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీతో (104) చెలరేగాడు. బ్రైడన్ కార్సే (56), జేమీ స్మిత్ (51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. బెన్ స్టోక్స్ (44), పోప్ (44) రన్స్ తో రాణించారు. 112.3 ఓవర్లలో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది.
Also Read: రోహిత్ శర్మకు బిగ్ షాక్..! వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా అతడికే..!