Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్..! వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా అతడికే..!

ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. పరుగుల వరద పారించాడు. ఇక ఇంగ్లాండ్‌లో అతని కెప్టెన్సీ ఆకట్టుకునేలా ఉంది.

Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్..! వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా అతడికే..!

Updated On : July 11, 2025 / 6:35 PM IST

Rohit Sharma: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు యువ ఆటగాడు శుభమన్ గిల్ కు అప్పగించారు. ఇప్పుడు భారత వన్డే కెప్టెన్ ఎవరు అనేదానిపై చర్చ జరుగుతోంది. వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి.. ఆ బాధ్యతలు కూడా గిల్ కు అప్పగిస్తారనే వార్తలు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టెస్ట్ కెప్టెన్‌గా సాధించిన అద్భుతమైన విజయం.. రోహిత్ శర్మ స్థానంలో భారత వన్డే కెప్టెన్‌గా గిల్ పగ్గాలు తీసుకుంటాడనే ఊహాగానాలకు కారణమైంది. 2027 ప్రపంచ కప్, రాబోయే వన్డేలకు గిల్ నాయకత్వం వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ ఘన విజయంతో భారత వన్డే కెప్టెన్‌గా గిల్ అవకాశాల గురించి చర్చ మొదలైంది. రోహిత్ శర్మ స్థానంలో 25 ఏళ్ల యువకుడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఇద్దరు క్రీడా జర్నలిస్టులు చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారితీసింది. వారి పోస్ట్ ఆధారంగా 2027 వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టులో మరో పెద్ద మార్పు జరగబోతుందనే ప్రచారం ఊపందుకుంది.

ఇప్పటికే టెస్టుల్లో టీమిండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కూడా అందుకోనున్నాడా అనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీన్ని సమర్థిస్తున్నారు. ఇది సరైన నిర్ణయంగా చెబుతున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రోహిత్ శర్మ ఉండగా ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు.

Also Read: పది ఓవర్లకే ఆకృతి కోల్పోయిన డ్యూక్‌ బంతి.. మరింత పాత బాల్ ఇచ్చార‌న్న సిరాజ్‌..

స్పోర్ట్స్ టాక్ ప్రకారం, 2027 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే, తదుపరి భారత్ ఆడే వన్డేలకు గిల్ నాయకత్వం వహిస్తాడని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో ఇది జరగొచ్చని అంటున్నారు.

2024లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ లో రోహిత్ టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత టెస్టులకు గుడ్ బై చెప్పాడు. అప్పటి నుంచి వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు నాయకత్వం వహించేందుకు, భారత్ తరపున వన్డే, టెస్టులు ఆడటానికి రోహిత్ శర్మ సంసిద్ధతను తెలిపాడు. అయితే, ఇంగ్లాండ్ తో టెస్ట్‌లకు జట్టును ప్రకటించడానికి ముందే BCCI సెలెక్టర్లు రోహిత్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుండి తొలగించాలని నిర్ణయించినట్లు నివేదికలు వచ్చాయి. దాంతో టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్ శర్మ.

టెస్ట్‌లకు ముందు వన్డేల్లో గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2023, 2024లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. పరుగుల వరద పారించాడు. ఇక ఇంగ్లాండ్‌లో అతని కెప్టెన్సీ ఆకట్టుకునేలా ఉంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సహచరులను కలుపుకుని ముందుకెళ్తున్నాడు. దీంతో వన్డే కెప్టెన్ బాధ్యతలు కూడా గిల్ కే ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇక, వన్డే కెప్టెన్ రేసులో వినిపిస్తున్న మరో పేరు శ్రేయాస్ అయ్యర్. అతను కూడా నాల్గవ స్థానంలో స్థిరపడ్డాడు. మరోవైపు IPLలో కెప్టెన్ గా అయ్యర్ చూపిన టాలెంట్ తో.. ఉత్తమ వైట్-బాల్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.