IND vs ENG KL Rahul to miss England series
KL Rahul miss England series : ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు, ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో బీసీసీఐ భారత జట్లను ప్రకటించనుంది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరెవరు చోటు దక్కించుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టునే దాదాపుగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
విశ్రాంతి కావాలని కేఎల్ రాహుల్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం తాను అందుబాటులో ఉంటానని చెప్పాడట. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు అతడి పేరును పరిగణలోకి తీసుకోకూడదని సెలక్టర్లు నిర్ణయించుకున్నారని సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారో లేదో అన్న ఆసక్తి నెలకొంది. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం అతడు రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లతో పోటీ పడాల్సి ఉంటుంది.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రాహుల్ ఫర్వాలేదనిపించాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 30.66 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఆసీస్ పర్యటనలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచారు. యశస్వి జైస్వాల్, నితీశ్ రెడ్డిలు మాత్రమే అతడి కంటే ఎక్కువ పరుగులు చేశారు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ఆరంభం కానుంది.
Catch Of The Year : నువ్వు మనిషివా.. పక్షివా..! గాల్లో అమాంతం డైవ్ చేస్తూ..
ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొనున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు తమ జట్లను ప్రకటించాయి. ఈ టోర్నీకి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12ను డెడ్‌లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నేడో, రేపో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. హైబ్రిడ్ మోడ్‌లో ఈ టోర్నీ జరగనుంది. భారత జట్టు ఆడే మ్యాచులు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్నాయి. గ్రూపు దశలో భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది.