Catch Of The Year : నువ్వు మనిషివా.. పక్షివా..! గాల్లో అమాంతం డైవ్ చేస్తూ..
న్యూజిలాండ్ ఫీల్డర్ నాథన్ స్మిత్ అమాంతంగా గాల్లో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.

Nathan Smith stunning catch in 2ODI against Srilanka
క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఫీల్డర్లు చేసే విన్యాసాలు నమ్మశక్యంగా ఉండవు. ఒకటికి రెండు సార్లు చూస్తే గానీ నమ్మలేం. తాజాగా ఓ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్ ఫీల్డర్ నాథన్ స్మిత్ అమాంతంగా గాల్లో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.
శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం హామిల్టన్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదిరించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 37 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (79), మార్క్ ఛాప్‌మెన్ (62)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22)లు ఫర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో మహేశ్ తీక్షణ నాలుగు వికెట్లు తీశాడు. వానిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫెర్నాండో, మలింగ ఒక్కొ వికెట్ సాధించారు.
Virat Kohli : ప్రపంచ రికార్డుపై కోహ్లీ కన్ను.. వన్డేల్లో మరో 96 పరుగులు చేస్తే..
అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. 30.2 ఓవర్లలో 142 పరుగులకే లంక కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ 113 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. లంక బ్యాటర్లలో కమిందు మెండీస్ (64) ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు. జనిత్ లియానగే (22), చమిందు విక్రమసింఘే (17), అవిష్కా ఫెర్నాండో (10)లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఓ’రూర్కీ మూడు వికెట్లు తీశారు. జాకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టాడు. మాట్ హెన్నీ, నాథన్ స్మిత్, మిచెల్ శాంట్నర్ తలా ఓ వికెట్ సాధించారు.
క్యాచ్ ఆఫ్ ది ఇయర్..
న్యూజిలాండ్ ఫీల్డర్ నాథన్ స్మిత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను విలియం ఓ’రూర్కీ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి ఎషాన్ మలింగ భారీ షాట్ ఆడాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ వెనుక వైపుగా గాల్లోకి లేచింది. తన కుడి చేతి వైపు పరుగెత్తుకుంటూ వచ్చిన నాథన్ స్మిత్ అమాంతం గాల్లోనే డైవ్ చేస్తూ బౌండరీ లైన్ వద్ద చక్కటి క్యాచ్ అందుకున్నాడు.
Chahal-Dhanashree : విడాకుల వార్తలు.. ఎట్టకేలకు మౌనం వీడిన చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ..!
ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాచ్ ఆఫ్ ది ఇయర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Nathan Smith! A screamer on the Seddon Park boundary to dismiss Eshan Malinga 🔥 #NZvSL #CricketNation pic.twitter.com/sQKm8aS07F
— BLACKCAPS (@BLACKCAPS) January 8, 2025