×
Ad

IND vs NZ : విశాఖ వేదిక‌గా నేడు నాలుగో టీ20 మ్యాచ్‌.. సంజూ శాంస‌న్ పైనే అంద‌రి క‌ళ్లు..

విశాఖ వేదిక‌గా నేడు భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు (IND vs NZ) నాలుగో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి

IND vs NZ 4th T20 match today at Visakhapatnam ACA VDCA Stadium

IND vs NZ : న్యూజిలాండ్ చేతిలో వ‌న్డే సిరీస్ ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా టీ20ల్లో మాత్రం టీమ్ఇండియా జోరు కొన‌సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే భార‌త్ సొంతం చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం టీమ్ఇండియా దృష్టి మొత్తం క్లీన్‌స్వీప్ పైనే ఉంది. ఈ క్ర‌మంలో విశాఖ వేదిక‌గా నేడు (జ‌న‌వ‌రి 28) కివీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మైంది సూర్య‌కుమార్ యాద‌వ్ సేన‌.

టీమ్ఇండియాకు అచ్చొచ్చిన మైదానాల్లో విశాఖ ఒక‌టి. ఇక్క‌డ అన్ని ఫార్మాట్ల‌లోనూ భార‌త జ‌ట్టుకు ఘ‌న‌మైన రికార్డు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ భార‌త్ నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. చివ‌రిసారిగా ఇక్క‌డ ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో 209 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ ఛేదించింది.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే ఐసీసీ తీసుకునే చ‌ర్య‌లు ఇవే..?

బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామం అయిన ఈ స్టేడియంలో భారీ స్కోర్లు న‌మోదు కావ‌డం ఖాయం. రాత్రి వేళ ఇక్క‌డ మంచు కురిసే అవ‌కాశం ఉండ‌డంతో ఎంత‌టి ల‌క్ష్యం అయినా కూడా సుర‌క్షితం కాదు. దీంతో టాస్ గెలిచిన జ‌ట్లు ఫీల్డింగ్ ఎంచుకోవ‌చ్చు. ఇక ఈ పిచ్ నుంచి స్పిన్న‌ర్ల‌కు కాస్త స‌హ‌కారం అందుతూ ఉంటుంది.

సంజూ రాణించేనా?
ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ మిన‌హా మిగిలిన భారత బ్యాట‌ర్లు అంద‌రూ ఈ సిరీస్‌లో ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్నారు. ఈ సిరీస్‌లో సంజూ వ‌రుస‌గా 10, 6, 0 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా క‌నీసం రెండు ఓవ‌ర్లు కూడా బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాడు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే ఐసీసీ తీసుకునే చ‌ర్య‌లు ఇవే..?

మ‌రోవైపు రీ ఎంట్రీలో ఇషాన్ కిష‌న్ దుమ్ములేపుతున్న నేప‌థ్యంలో సంజూ ఇలాగే విఫ‌లం అయితే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌డి స్థానం గ‌ల్లంతు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో సంజూ శాంస‌న్ భారీ ఇన్నింగ్స్ ఆడాల‌ని అత‌డి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.