IND vs NZ 4th T20 Suryakumar Yadav need 41 runs to join 3000 T20I runs
Suryakumar Yadav : విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (బుధవారం జనవరి 28న) నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో సూర్య 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్ గా రికార్డులకు ఎక్కుతాడు. అంతేకాదండోయ్ ఈ మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్న రెండో ఆటగాడిగా నిలుస్తాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. రోహిత్ శర్మ 159 టీ20 మ్యాచ్‌ల్లో 32.05 సగటు 140.89 స్ట్రైక్‌రేటుతో 4231 పరుగులు చేశాడు.
కోహ్లీ 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటు 137.04 స్ట్రైక్‌రేటుతో 4188 పరుగులు సాధించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అతడు 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 96 ఇన్నింగ్స్‌ల్లో 36.98 సగటు 165.03 స్ట్రైక్‌రేటుతో 2959 పరుగులు సాధించాడు.
భారత్ తరుపున టీ20ల్లో మూడు వేల పరుగుల మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 81 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా రోహిత్ శర్మ 108 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని అందుకున్నాడు. విశాఖ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ సూర్య కెరీర్‌లో 97వ ఇన్నింగ్స్ మాత్రమే. ప్రస్తుతం సూర్య ఉన్న ఫామ్‌ను పరిగనలోకి తీసుకుంటే ఈ మ్యాచ్‌లోనే ఈ ఘనతను అతడు అందుకునే అవకాశాలు ఉన్నాయి.
అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో భారత్ తరుపున 3 వేల టీ20 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 81 ఇన్నింగ్స్‌ల్లో
* రోహిత్ శర్మ – 108 ఇన్నింగ్స్‌ల్లో