Tilak Varma : న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్ నేడే.. తిలక్ వర్మ@100 సిక్సర్లు.. అందుకునేనా?
న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మను (Tilak Varma) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- November 1, 2026 / 09:48 AM IST
IND vs NZ 5th T20 Match Today Tilak Varma eye on major milestone
Tilak Varma : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు (నవంబర్ 1) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మూడు టీ20ల్లో విజయం సాధించిన భారత్ ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకుంది.
అయితే.. నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్ ఘన విజయం సాధించింది. మరో మూడు రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
హామిల్టన్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడి బౌండరీ కొలతలు కూడా మిగిలిన మైదానాలతో పోలిస్తే కాస్త చిన్నవిగానే ఉంటాయి. ఈ క్రమంలో పరుగుల వరద పారవచ్చు. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.
తిలక్ ఐదో టీ20 మ్యాచ్‌లో 3 సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
భారత్ తరుపున రోహిత్ శర్మ(205), సూర్యకుమార్ యాదవ్(179), అభిషేక్ శర్మ(159),హార్దిక్ పాండ్యా(126), విరాట్ కోహ్లీ (124), సంజూ శాంసన్ (108)లు మాత్రమే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వంద సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు.
