IND vs NZ : వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లతో తొలి భారత బౌలర్‌గా మహ్మద్ షమీ..

IND vs NZ : వన్డే ప్రపంచ కప్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ రికార్డులు బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో షమీ అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు.

IND vs NZ : Mohammed Shami becomes 1st India bowler : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన ఫీట్ సాధించాడు. తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు. భారత పేసర్ తన 17వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని సాధించిన షమీ.. ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టాడు.

Read Also : Virat Kohli World Record : వన్డేల్లో విరాట్ కోహ్లీ హిస్టరీ, సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్

2023 ఎడిషన్‌లో తన 19వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్‌తో జరిగిన ప్రపంచ కప్ 2023లో భారత్ సెమీ-ఫైనల్‌లో షమీ ఈ ఘనత సాధించాడు. మెగా ఈవెంట్ చరిత్రలో గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, స్టార్క్, లసిత్ మలింగ, వసీం అక్రమ్, ట్రెంట్ బౌల్ట్ తర్వాత 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఏడో వ్యక్తిగా షమీ అవతరించాడు.

టాప్ ప్లేసులో షమీ..
అంతకుముందు ప్రపంచకప్‌లో షమీ.. జహీర్ ఖాన్ జవగల్ శ్రీనాథ్‌ల 44 పరుగులను అధిగమించి వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 57 పరుగులకు షమీ 7 వికెట్లు తీసి వన్డేలో అత్యధిక గణాంకాలను తన పేరిట నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 23 వికెట్లతో టాప్ ప్లేసులో నిలిచాడు. ఆ తర్వాత ఆడమ్ జంపా 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో 2 స్థానంలో నిలవగా.. దిల్షాన్ మధుశంక 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో 3వ స్థానంలో నిలిచాడు.

షమీ మళ్లీ అదరగొట్టేశాడుగా :

హార్దిక్ పాండ్యా స్థానంలో భారత ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నప్పటి నుంచి షమీ తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. బ్లాక్ క్యాప్స్‌పై ఐదు వికెట్లను పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత, వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను మరో ఐదు వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన షమీ 16 వికెట్లు పడగొట్టి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.

Mohammed Shami becomes 1st India bowler

సెమీస్‌లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో, షమీ డెవాన్ కాన్వేని అవుట్ చేశాడు. ఆ తర్వాత టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ అత్యధిక పరుగుల స్కోరర్‌ను కోల్పోవడంతో రచిన్ రవీంద్రను పెవిలియన్‌కు పంపాడు. భారత జట్టుకు చుక్కలు చూపిస్తున్న కేన్ విలియమ్సన్ వికెట్ పడగొట్టిన షమీ 50 వికెట్ల మార్కుకు చేరుకున్నాడు.

ఇదిలా ఉండగా.. సెమీఫైనల్‌ పోరులో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన భారత్ వన్డే ప్రపంచకప్‌లో నాల్గోసారి ఫైనల్‌కు చేరుకుంది. గతంలో 1983, 2003, 2011లోనూ టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. టీమిండియా నిర్దేశించిన 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కివీస్.. కేవలం 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ జట్టులో డారిల్ మిచెల్ 134 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు.

Read Also : IND vs NZ Semi Final : ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం.. ఫైన‌ల్‌లోకి.. ఇంక్కొక్క‌టే..!

ట్రెండింగ్ వార్తలు