×
Ad

Kohli-Rohit : రోహిత్, కోహ్లీ భార‌త జెర్సీలో మ‌ళ్లీ క‌నిపించేది అప్పుడేనా?

న్యూజిలాండ్‌తో సిరీస్ ముగియ‌డంతో మ‌ళ్లీ భార‌త జెర్సీలో రోహిత్‌, కోహ్లీలు (Kohli-Rohit) ఎప్పుడు క‌నిపిస్తారు అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

IND vs NZ ODI series over When will Kohli and Rohit play next match for India

  • వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న రోహిత్, కోహ్లీ
  •  కివీస్‌తో ముగిసిన వ‌న్డే సిరీస్‌
  •  భార‌త జెర్సీలో మ‌ళ్లీ రో-కోలు క‌నిపించేది ఎప్పుడంటే?

Kohli-Rohit : న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ ముగిసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్‌లో టీమ్ఇండియా సీనియర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడగా మ‌రో సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ విఫ‌లం అయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో 61 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు ఎప్పుడో వీడ్కోలు ప‌లికిన ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.

కివీస్‌తో వ‌న్డే సిరీస్ ముగియ‌డంతో వీరిద్ద‌రు మ‌ళ్లీ భార‌త జెర్సీలో ఎప్పుడు క‌నిపిస్తారా? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌న‌వ‌రి 21 నుంచి భారత జ‌ట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది.

AUS vs PAK : పాక్ ప‌ర్య‌ట‌న కోసం ఆస్ట్రేలియా జ‌ట్టు ఎంపిక.. యువ ఆట‌గాళ్ల‌కి చోటు..

ఆ త‌రువాత ఫిబ్ర‌వ‌రి 7 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌నుంది. ఈ మెగాటోర్నీ ముగిసిన వారం, పది రోజుల వ్య‌వ‌ధిలోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. అంటే ఈ లెక్క‌న మ‌రో ఆరు నెల‌ల పాటు రో-కోను భార‌త జెర్సీలో చూసే అవ‌కాశం లేదు.

ఎప్పుడు చూడొచ్చంటే?

టీమ్ఇండియా అంత‌ర్జాతీయ షెడ్యూల్ ను ప‌రిశీలిస్తే.. ఈ ఏడాది భార‌త జ‌ట్టు జూలైలో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడ‌నుంది. జూలై 14 నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుండ‌గా, జూలై 26 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది.

ICC : బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్‌..? ఇక మీ ఇష్టం..? బంగ్లా త‌ప్పుకుంటే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడే జ‌ట్టు ఇదే..!

అంటే ఈ లెక్క‌న కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను మ‌ళ్లీ జూలైలోనే భార‌త జెర్సీలో చూసే అవ‌కాశం ఉంది. అంత‌కంటే ముందే ఐపీఎల్‌లోనూ కోహ్లీ, రోహిత్ ల ఆట‌ను చూడొచ్చు.