IND vs NZ Shreyas Iyer and Ravi Bishnoi added to T20I squad Washington Sundar ruled out
Shreyas Iyer : జనవరి 21 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు.. వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మలు గాయపడి సిరీస్‌కు దూరం అయ్యారు. వీరిస్థానాల్లో రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
కాగా.. అయ్యర్ దాదాపు రెండేళ్ల తరువాత జాతీయ టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అయ్యర్ తొలి మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు కివీస్ తో తొలి వన్డేలో గాయపడిన సుందర్ టీ20 సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో పునరావాసంలో ఉన్నాడు.
ఇక సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన బిష్ణోయ్ 42 టీ20 మ్యాచ్‌ల్లో 61 వికెట్లు పడగొట్టాడు. అతడి చివరి సారిగా భారత జట్టు తరుపున 2025 ఫిబ్రవరిలో టీ20 మ్యాచ్ ఆడాడు.
🚨 News 🚨
Shreyas Iyer & Ravi Bishnoi added to #TeamIndia T20I squad; Washington Sundar ruled out.
Details ▶️ https://t.co/cNWHX9TOVk#INDvNZ | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 16, 2026
Steve Smith : చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. బిగ్‌బాష్ లీగ్‌లో ఒకే ఒక్కడు..
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు నవీకరించిన భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్.