IND VS PAK : టీ20 ప్రపంచకప్.. ఉత్కంఠ పోరులో పాక్‌పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం

IND VS PAK : భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ పోరాడి ఓడింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Pic Credit: @BCCI Twitter

IND VS PAK : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (జూన్ 9) ఇక్కడ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ బౌలర్లు పాక్ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశారు.

దాంతో భారత జట్టు నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దాయాది పాకిస్థాన్ పోరాడి ఓడింది. ఆ జట్టు ఓపెనర్లలో మహ్మద్ రిజ్వాన్ (31) పరుగులు చేయగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్ వరుసగా (13) పరుగులకే పెవిలియన్ బాటపట్టేశారు.

ఇమాద్ వసీం (15) పరుగులతో రాణించాడు. షాదాబ్ ఖాన్ (4), ఇఫ్లికార్ అహ్మద్ (5) నిష్క్రమించగా, నషీం షా (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఫలితంగా, నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరాజయం పాలైంది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.

బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ :
ఈ టోర్నీలో టీమిండియాకు వరుసగా రెండో విజయం కాగా, పాకిస్థాన్ వరుసగా రెండోసారి ఓటమిపాలైంది. పాక్ పతనాన్ని శాసించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

విఫలమైన భారత్ బ్యాటర్లు.. పాక్ టార్గెట్ 120 :
అంతకుముందు టాస్ గెలిచిన దాయాది పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (4) పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (13) పరుగులకే చేతులేత్తేశాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (42; 31 బంతుల్లో 6 ఫోర్లు) పర్వాలేదనిపించగా.. అక్షర్ పటేల్ (20) పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన భారత్ ఆటగాళ్లలో సూర్యకుమార్ యాద్ (7), శివం ధూబే (3), హర్దిక్ పాండ్యా (7), హర్షదీప్ సింగ్ (9) పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్‌కే పరిమితమై ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు.

జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఖాతానే తెరవలేదు. పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో కుప్పకూలిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా దాయాది పాకిస్థాన్ జట్టుకు భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా, మహ్మద్ అమీర్ 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది ఒక వికెట్ తీసుకున్నాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ అజాం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

Virat Kohli : పాక్‌తో మ్యాచ్‌.. కోహ్లికి కైఫ్ కీల‌క సూచ‌న‌.. దాన్ని త‌గ్గించుకో..

ట్రెండింగ్ వార్తలు