India Vs South Africa
India Vs South Africa: రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. చివరిలో భారత్‌ను భయపెట్టినప్పటికీ.. వరుస వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైంది. అయితే, భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. 120 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్సుల సహాయంతో 135 పరుగులు చేశాడు. అయితే, కోహ్లీ సెంచరీతో సంబరాలు చేసుకుంటున్న వేళ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తొలి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అదరగొట్టారు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన శుభారంభాన్ని పెద్ద స్కోరుగా మార్చుకోవడంలో విఫలమయ్యాడు, 22వ ఓవర్లో జాన్సెన్ బౌలింగ్‌లో 57 పరుగులకు ఔట్ అయ్యాడు. అందులో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, తన సహచరుడు విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసిన సమయంలో సంబురాలు చేసుకున్నాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A leap of joy ❤️💯
A thoroughly entertaining innings from Virat Kohli 🍿
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5
— BCCI (@BCCI) November 30, 2025
రాంచీ వన్డేలో నమోదైన రికార్డులివే..
♦ రాంచీ వన్డేలో విరాట్ సెంచరీతో ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 51 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు.
♦ అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి 83వ సెంచరీ కూడా. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ ఇప్పుడు 17 సెంచరీలు వెనుకబడి ఉన్నాడు.
♦ విరాట్ సాధించిన ఈ సెంచరీ పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 7000వ సెంచరీగా కూడా నిలిచింది.
♦ రోహిత్, విరాట్ రెండో వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది వన్డే క్రికెట్ లో వారి 20వ సెంచరీ భాగస్వామ్యం. దీనితో, వారు ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నారు.
♦ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2015 నుండి అఫ్రిది 351 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు.
♦ 369 ఇన్నింగ్స్‌లలో 351 సిక్సర్లతో అఫ్రిది రికార్డును అధిగమించడానికి మాజీ కెప్టెన్‌కు మ్యాచ్‌కు ముందు కేవలం మూడు సిక్సర్లు మాత్రమే అవసరం. మరోవైపు, రోహిత్ 100 తక్కువ ఇన్నింగ్స్‌లలో మాజీ పాకిస్తాన్ ఆల్ రౌండర్ రికార్డును బద్దలు కొట్టాడు, ఇప్పుడు 269 ఇన్నింగ్స్‌లలో 352 సిక్సర్లు బాదాడు.