Tilak Varma need 4 runs to 1000 international T20 runs
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ నాలుగు పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
2023లో టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన తిలక్ వర్మ ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు ఆడాడు. 33 ఇన్నింగ్స్‌లో 47.4 సగటుతో 996 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్థశతకాలు ఉన్నాయి.
IND vs SA : మంగళవారం నుంచే టీ20 సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇదిలా ఉంటే.. భారత్, దక్షిణాప్రికా జట్లు ఇప్పటి వరకు 31 టీ20 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.